కక్షగట్టి తప్పుడు కేసులు | - | Sakshi
Sakshi News home page

కక్షగట్టి తప్పుడు కేసులు

Jan 25 2026 7:15 AM | Updated on Jan 25 2026 7:15 AM

కక్షగట్టి తప్పుడు కేసులు

కక్షగట్టి తప్పుడు కేసులు

తిరుపతి కల్చరల్‌ : చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తోందని, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు కుట్రపూరితంగా పోలీసులను వినియోగించి అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీ శ్రేణులను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే థామస్‌ టార్గెట్‌ చేసి మరీ ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు నిర్వహించారని పెనుమూరు మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త దేవరాజులురెడ్డిపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమన్నా రు. ఆయన తన పొలంలో మట్టిని యంత్రాలతో చదును చేసుకుంటే ఎమ్మెల్యే ఒత్తిడి చేసి ఎస్‌ఐతో అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. పైగా టిప్పర్లు, జేసీబీని సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్ని స్తే కేసు నమోదు చేస్తామని బెదిరించడం నిరంకుశమన్నారు. వైఎస్సార్‌సీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు కుట్ర చేయడం అప్రజాస్వామికమని స్పష్టం చేశారు. అలాగే పెనుమూరుకు చెందిన రూపేష్‌ అనే యువకుడు దుకాణం ఏర్పాటు చేసుకుంటుంటే టీడీపీ నేతలు బెదిరించి అడ్డుకోవడం అన్యాయమని మండపడ్డారు. టీడీపీ నేతలు చెప్పినట్లే పనిచేయాలని పోలీసులకు చంద్రబాబు పరోక్ష సంకేతాలు ఇవ్వడంతోనే ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. జీడీ నెల్లూరులో కొండలు కరిగిపోతున్నాయని, రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా గ్రావెల్‌ అక్రమ రవాణా సాగుతోందని ఆరోపించారు. గతంలో కులమతాలకు అతీతంగా ప్రజలు, నేతలు కలిసి మెలసి ఉండేవాళ్లమని, చంద్రబాబు ప్రభు త్వం వచ్చిన తర్వాత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అధికారం ఇచ్చింది సంక్షేమ పాలన అందించేదుకని, కక్ష సాధింపులకు కాదని స్పష్టం చేశారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి జీడీనెల్లూరులో టీడీపీ నేతలు సాగిస్తున్న అరాచకాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నేతలు గిరిధర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, లోకేష్‌రెడ్డి, దూది మోహన్‌, వినోద్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement