వరసిద్ధుని సేవలో ఆర్‌టీఐ కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

వరసిద్ధుని సేవలో ఆర్‌టీఐ కమిషనర్‌

Jan 25 2026 7:15 AM | Updated on Jan 25 2026 7:15 AM

వరసిద

వరసిద్ధుని సేవలో ఆర్‌టీఐ కమిషనర్‌

కాణిపాకం : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామిని శనివారం ఆర్‌టీఐ కమిషనర్‌ ఒంటే రు రవిబాబు సేవించుకున్నారు. ఆలయ అధి కారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశా రు. పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంత రం స్వామి ప్రసాదం,చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో ఈఓ పెంచలకిషోర్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ మణినాయుడు పాల్గొన్నారు.

7,505 పశువులకు వైద్యం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లా వ్యాప్తంగా శనివారం 66 పశు వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పశువైద్యాధికారి ఉమామహేశ్వరి మాట్లాడుతూ ఈ శిబిరాలను 2,276 మంది పాడి రైతులు సద్వినియోగం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం 7,505 పశువులకు వైద్యం అందించినట్లు వివరించా రు. అలాగే గొర్రెలు, మేకలకు కూడా సేవలు అందించామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 516 ఆరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు.

ఓపెన్‌ స్కూల్‌

అడ్మిషన్ల పెంపునకు కృషి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఏపీ ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల పెంపునకు కృషి చేస్తామని కో–ఆర్డినేటర్‌ జయప్రకాష్‌నాయుడు తెలిపా రు. శనివారం ఈ మేరకు డీఈఓ రాజేంద్రప్రసాద్‌ చేతుల మీదుగా ఆయన నియామక ఉత్తర్వులు స్వీకరించారు. అనంతరం బాధ్యతలు చేపట్టి విలే కరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏపీ ఓపెన్‌ స్కూల్‌ కో–ఆర్డినేటర్‌గా పనిచేసిన అనుభవం ఉందని చెప్పారు. ఓపెన్‌ స్కూల్‌ను నిరక్షరాస్యులు సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తామని వివరించారు.

త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం

చిత్తూరు కార్పొరేషన్‌: చిత్తూరు ట్రాన్స్‌కో అర్బన్‌ డివిజన్‌ పరిధిలో కార్యాలయాల నిర్మాణానికి టెండర్లు పూర్తి చేశామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఈఈ మునిచంద్ర తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ అర గొండ సెక్ష న్‌ కార్యాలయం, ప్రహగీగోడ నిర్మాణాకి రూ.40 లక్షలు, చిత్తూరు ఈఈ కార్యాలయ పరిధిలోని ఈఆర్వో కార్యాలయం జీ+2 నిర్మాణానికి రూ.3.20 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు.

వరసిద్ధుని సేవలో  ఆర్‌టీఐ కమిషనర్‌ 
1
1/1

వరసిద్ధుని సేవలో ఆర్‌టీఐ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement