సస్యరక్షణతో అధిక దిగుబడి | - | Sakshi
Sakshi News home page

సస్యరక్షణతో అధిక దిగుబడి

Jan 25 2026 7:15 AM | Updated on Jan 25 2026 7:15 AM

సస్యరక్షణతో అధిక దిగుబడి

సస్యరక్షణతో అధిక దిగుబడి

తవణంపల్లె: మామిడిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడి సాధించవచ్చని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. శనివారం అరగొండ రాముల గుడిలో రాస్‌ కృషి విజ్ఞాన కేంద్రం, కోకోకో లా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో మామిడిలో సమగ్ర పోషణ, సస్యరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. సుధాకర్‌ మాట్లాడుతూ సస్యరక్షణ తో సమర్థవంతంగా చీడపీడలను నివారించవచ్చన్నా రు. దీంతో నాణ్యమైన పంటను పొందవచ్చునని చెప్పారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడి పూత ఒకేసారి రావడానికి మల్టీ–కే 10 గ్రాములు, క్టోరిఫైరిఫాస్‌ 50 ఈసీఏ ఎంఎల్‌, వేపనూనె 3 ఎంఎల్‌, సాప్‌ 2 గ్రాముల చొప్పున లీటరు నీటిలో కలిపి పిచకా రీ చేసుకోవాలని వివరించారు. తేనె మంచు పురుగు లు, బూడిద తెగులు నివారణకు బుఫ్రఫెజిన్‌ 1.5 ఎంఎల్‌, హెక్సాకోవజోల్‌ 2 ఎంఎల్‌, సూక్ష్మ పోషక మిశ్రమాన్ని 5 గ్రాములు లీటరు నీటిలో కలిపి స్ప్రే చేయించాలని సూచించారు. ఉద్యానవన శాఖ అధికారి సాగరిక మాట్లాడుతూ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి కలిగిన రైతులు ముందుకు రావాలన్నారు. అలాగే ట్రేల్‌ కొనుగోలు చేస్తే రాయితీ ఇస్తామ ని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త అనిల్‌కుమార్‌, ఏఓ వందన, సర్పంచ్‌ మల్లుదొరై, ఎఫ్‌పీఓ చైర్మన్‌ కుమార్‌స్వామి నాయుడు, అరగొండ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement