హోటల్లో అగ్నిప్రమాదం
చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని హైరోడ్డులో ఉన్న విష్ణు భవన్ హోటల్‌లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఆ హోటల్లో పనిచేస్తున్న వంట మాస్టర్ వడలు నూనెలో వేస్తున్న సమయంలో బాండ్లీలో మంటలు ఎక్కువగా వ్యాపించాయి. ఆ మంటలను వెంటనే నీళ్లతో ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. అయితే మంటలు వేగవంతంగా ఆ గది మొత్తం వ్యాపించాయి. ఆ హోటల్ నిర్వాహకులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి, ఏడీఎఫ్‌వో కరుణాకర్ తన సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. హోటల్లో ఉన్న వినియోగదారులందరినీ బయటకు పంపించారు. ఈ ఘటనలో ఒక వంట మనిషికి స్వల్ప గాయాలయ్యాయి. యాజమాన్యం పనిచేస్తున్న సిబ్బందికి అవసరమైన సహాయక వస్తువులు, హోటల్లో అగ్నిప్రమాద నివారణకు పరికరాలు సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో రూ.9.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.
సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం
కాణిపాకం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ కల్లూరి గోవర్దన్‌రెడ్డి (హైకోర్టు న్యాయవాది) ఆదివారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం కాణిపాకం విచ్చేశారు. దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుంటానన్నారు. వారికి అండగా ఉండి, లీగల్‌గా వారి సమస్యలపై, ప్రత్యేక దృష్టి పెట్టి న్యాయం చేస్తానని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతలు ప్రభాకర్ రెడ్డి, లత, రాజేష్‌రెడ్డి, గోపి సాగర్, బాబు, బ్రహ్మతేజ పాల్గొన్నారు.
హోటల్లో అగ్నిప్రమాదం
హోటల్లో అగ్నిప్రమాదం


