కొత్తగా సన్నద్ధం! | - | Sakshi
Sakshi News home page

కొత్తగా సన్నద్ధం!

Dec 23 2025 7:02 AM | Updated on Dec 23 2025 7:02 AM

కొత్త

కొత్తగా సన్నద్ధం!

● ఇంటర్‌లో కొత్త విధానం ● ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు ● ఐదు పేపర్ల ప్యాట్రన్‌పై స్పష్టత

కార్వేటినగరం: ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రథమ సంవత్సరంలో ఆరు పేపర్ల స్థానంలో ఐదు పేపర్లు మాత్రమే అమలు చేయనున్నట్టు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న వార్షిక పరీక్షలకు విద్యార్థులు నూతన విధానంలోనే సన్నద్ధమవుతున్నారు. గణితం, బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో మారిన మార్కుల కేటాయింపునకు అనుగుణంగా కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అధికారులు సైతం ఇంటర్‌ కళాశాలల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించి నూతన సంస్కరణలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

సంస్కరణల్లో భాగంగా ఇంటర్మీడియెట్‌ విద్యలో ఇంటర్‌ విద్యామండలి ఈ ఏడాది నుంచి ఫస్టియర్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గణితం, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రశ్నాపత్రాల్లో మార్కుల కేటాయింపు, ప్రశ్నపత్రాల సరళి కూడా మారింది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానుండడంతో ఇంటర్‌ బోర్డు అధికారులు నూతన పరీక్ష విధానంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.

ఎంపీసీలో ఇలా..

ఎంపీసీ గ్రూపునకు సంబంధించి మొత్తం 500 మార్కులకు గాను ఇందులో రాత పరీక్షకు 470 మార్కులు, ప్రయోగాలకు 30 మార్కులు (ఫిజిక్స్‌ 15, కెమిస్ట్రీ 15) కేటాయించారు. ఇప్పటి వరకు మ్యాథ్స్‌ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహించేవారు (పేపర్‌–1ఏకు 75, పేపర్‌–1బీకి 75 మార్కుల చొప్పున మొత్తం 150 మమార్కులు). ఇకపై మొదటి సంవత్సరంలో 100 మార్కులకు మ్యాథ్స్‌ పేపర్‌ ఉంటుంది. పాస్‌ మార్కులను 35గా నిర్ణయించారు. గతంలో ఫిజిక్స్‌ 60, కెమిస్ట్రీ 60 మార్కులకు ఉండేది. ఆ స్థానంలో ఈ రెండు సబ్జెక్టులను ఒక్కో పేపర్‌కు 85 మార్కులు ఉండేలా మార్పులు చేశారు. వీటితో పాటు రెండు లాంగ్వేజి సబ్జెక్టులు ఒక్కొక్కటి వంద మార్కులకు ఉంటాయి.

బైపీసీలో ఇలా..

బైపీసీలో కొత్తగా బయాలజీ పేపర్‌ బైపీసీ గ్రూపులో మొత్తం 500 మార్కులు ఉంటాయి. ఇందులో రాత పరీక్షలకు 455 మార్కులు, ప్రాక్టికల్స్‌కు 45 మార్కులు (ఫిజిక్స్‌15, కెమిస్ట్రీ15, బయాలజీ15) కేటాయించారు. గతంలో బోటనీ 60, జువాలజీ 60 మార్కులకు ఉండేది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు సబ్జెక్టులు కలిపి 85 మార్కులకు ఒకే ప్రశ్నపత్రం(బయాలజీ) ఇస్తారు. ఇందులో బోటనీకి 43 మార్కులు, జువాలజీకి 42 మార్కులు నిర్ధేంశించారు. అయితే మూల్యాంకనానికి వీలుగా జవాబు పత్రాలు మాత్రం వేర్వేరుగా ఇవ్వనున్నారు. విద్యార్థులు రెండు జవాబు పత్రాల్లో బోటనీ, జువాలజీ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు రెండు సబ్జెక్టులను సమన్వయం చేసుకుంటూ చదువుతున్నారు. పాస్‌ మార్కులు 29గా నిర్ణయించారు.

జిల్లాలో ఇంటర్‌ కళాశాలల వివరాలు

పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు

స్పష్టత వచ్చింది

మొదట్లో పేపర్లు తగ్గాయని, మార్కులు పెరిగాయని తెలిసినప్పుడు కాస్త కంగారు పడ్డాం. కానీ మా లెక్చరర్లు కొత్త విధానంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. 100 మార్కుల మ్యాథ్స్‌ పేపర్‌, 85 మార్కుల ఫిజిక్స్‌ పేపర్‌ రాయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. మా కళాశాలలో కూడా నూతన విధానానికి తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నారు. – నందిని,

ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థి, బైపీసీ, కార్వేటినగరం

అవగాహన కల్పిస్తున్నాం

ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన సంస్కరణలపై విద్యార్థులు, అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లకు అవగాహన కల్పించాం. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 5 పేపర్లు ఉంటాయి. సిలబస్‌ను కూడా హేతుబద్ధీకరించారు. ఇది జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రభుత్వ కళాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు వీలుగా ఉంటుంది.

– రఘుపతి, ఇంటర్‌ బోర్డు జిల్లా అధికారి

కొత్తగా సన్నద్ధం!1
1/1

కొత్తగా సన్నద్ధం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement