నోటిఫికేషన్ ఇచ్చింది వైఎస్ జగన్.. బాబు సర్కారు పెట్ట
– జెండా ఊపిన ఎస్పీ
చిత్తూరు అర్బన్: 2022 నవంబర్‌లో నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయించారు. 2023 జనవరిలో ప్రిలిమ్స్ నిర్వహించి, ఫలితాలు కూడా విడుదల చేశారు. ఆపై ఎన్నికల నేపథ్యంలో మెయిన్స్ జరగలేదు. అటు తరువాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుది పరీక్షలు నిర్వహించి ఈ ఏడాది జూన్‌లో ఫలితాలను విడుదల చేసింది. ఆర్నెళ్ల పాటు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు స్టైఫండ్ కూడా కోల్పోయారు. ఇప్పుడు కానిస్టేబుల్ అభ్యర్థులకు మంగళవారం విజయవాడలో సీఎం చంద్రబాబు చేతులు మీదుగా నియామకపత్రాలు ఇవ్వనున్నట్లు ప్రకటించి, అభ్యర్థులందరినీ విజయవాడకు తీసుకెళ్లారు. గతంలో నారా లోకేశ్ పాద యాత్రకు ‘యువగళం’ అనే పేరుపెట్టగా..ఇప్పుడు ప్రభుత్వ కార్యాక్రమానికి కూడా అదే పేరుపెట్టడం చర్చనీయాంశంగా మారింది.


