పలమనేరులో టెన్షన్..టెన్షన్!
మళ్లీ అక్రమ నిర్మాణ రగడ!
పలమనేరు: పలమనేరు పట్టణంలో మళ్లీ అక్రమ నిర్మాణ రగడ రాజుకుంది. గతంలో గుడియాత్తం మెయిన్ రోడ్డుకు ఆనుకొని స్థానిక ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి పేరిట ఓ వ్యక్తి రస్తాపోరొంబోకులో పక్కా భవనా న్ని నిర్మించేందుకు యత్నించారు. దీన్ని అప్పట్లో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అడ్డు కున్నారు. ఇక్కడి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పలువురిపై కేసులు నమోదు చేశారు. దీనిపై వారు హైకోర్టు ద్వారా బెయిల్ పొందారు. ఇలా ఉండగా ఇదే అక్ర మ నిర్మాణాన్ని సోమవారం రాత్రి రహ స్యంగా చేపడతారనే విషయం తెలిసి మళ్లీ తాను దీన్ని అడ్డుకుంటాన్నంటూ మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ సామాజిక మాద్యమాల ద్వారా హెచ్చరించారు. దీంతో పలమనేరులో టెన్షన్ వాతావరణం నెలకొంది.
అధికారుల తప్పిదాలతోనే...
అధికారుల చేసిన తప్పులు ఎప్పటికై నా వారికి శాపాలుగా మారాల్సిందే. ఇప్పుడు పలమనేరు పట్టణంలో హాట్‌టాపిగ్ మారి న స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పీఏ అని చెప్పుకుంటున్న పార్థసారథి వ్యవహారాన్ని లోతుగా గమనిస్తే గతంలో రెవెన్యూ, మున్సిపల్ శాఖలు చేసిన తప్పులు కనిపిస్తున్నాయి.
నోరు మెదపని అధికారులు
ఇలా ఉండగా మళ్లీ అక్రమ నిర్మాణం సాగుతుందనే విషయమై మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. టీపీవో ఇందిర సైతం మాట్లాడలేకపోవడం కొసమెరుపు.
సెంటు ఎలా పెద్దదైందో?
సెంటు స్థలానికి ప్లాన్‌అప్రూవల్ అయ్యి ఉంటే ఇప్పుడు అక్కడ సైట్ ఎలా పెద్దదైంతో మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులకే తెలియాలి. ఎప్పటికప్పుడు నిబంధనలు పాటించకుండా అధికారులు చేసిన తప్పిదాలు ఇప్పుడున్న అధికారులకు శాపాలు గా మారి అధికార పార్టీ మాట వినాలా లేకా రూల్‌పొజిషన్‌లో పోవాలా దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
దానికి ఎలా పట్టా ఇచ్చారు?
పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో కాలే జీ సర్కిల్ వద్ద 2018లో నాటి రెవెన్యూ అధికారులు సర్వే నం.350/2లో సెంటు స్థలానికి ఓ మహిళకు సెంటు స్థలంలో పట్టా ఇచ్చారు. ఆ సర్వే నంబరులో మొత్తం వీస్తీర్ణం 5.34 సెంట్లు రస్తాపోరంబోకుగా రికార్డుల్లో ఉంది. అసలు రస్తాలో ఎలా పట్టాలిచ్చారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ స్థలం కిందనే పలు తాగునీటి పైపులైన్లు, పక్కనే ఓవర్‌హెడ్ ట్యాంకు, కౌండిన్య పైప్ లైన్లుంటే అప్పటి మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఎలా ప్లాన్ అప్రూవల్ చేశారనేది అంతుపట్టడం లేదు. ప్లాన్ అప్రూవల్ ఇచ్చినా పట్టాదారు ఎందుకు అప్పట్లోనే పక్కా నిర్మాణం చేపట్టలేదో తెలియరాలేదు. అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారని, అధికారభయంతోనే అప్పటి అధికారులు అప్రూవల్ చేశారనే మాట వినిపిస్తోంది. దీనిపై ఇటీవల జరిగిన మున్సిపల్ మీట్‌లోనూ పలువురు కౌన్సిలర్లు సమస్యను లేవనెత్తారు. ఇది తప్పేనని రెవెన్యూ అధికారులు సైతం అక్కడే సెలవిచ్చారు.


