నేడు కానిస్టేబుల్‌ అభ్యర్థులకు నియామక పత్రాలు | - | Sakshi
Sakshi News home page

నేడు కానిస్టేబుల్‌ అభ్యర్థులకు నియామక పత్రాలు

Dec 16 2025 4:26 AM | Updated on Dec 16 2025 4:26 AM

నేడు కానిస్టేబుల్‌ అభ్యర్థులకు నియామక పత్రాలు

నేడు కానిస్టేబుల్‌ అభ్యర్థులకు నియామక పత్రాలు

చిత్తూరు అర్బన్‌: కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు మంగళవారం విజయవాడలో నియామక పత్రాలు అందజేయనున్నట్లు చిత్తూరు ఎస్పీ తుషార్‌ డూడీ తెలిపారు. జిల్లా నుంచి ఎంపికై న 196 మంది అభ్యర్థులకు బస్సుల్లో సోమవారం విజయవాడకు పంపించారు. అంతకుముందు చిత్తూరులో అభ్యర్థులతో ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగ ఫలితాలు ఇటీవల వెలువడ్డాయని, ఈ నెలలోనే శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. సీఎం చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారన్నారు. పోలీసు ఉద్యోగానికి ఎంపికై న ప్రతీ ఒక్కరూ నిజాయితీతో, నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement