చలో తిరుపతికి 150 కార్లతో ర్యాలీ
చిత్తూరు కార్పొరేషన్: పేదలను నాశనం చేసేలా చంద్రబాబు సర్కారు చేస్తున్న కుట్రలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇటీవల ముగిసింది. ఈ సందర్భంగా జిల్లాలో సేకరించిన సంతకాల పత్రులను తిరుపతి నుంచి విజయవాడకు తరలించనున్నారు. వాటికి మద్దతుగా ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు నుంచి 150 కార్లతో భారీ ర్యాలీగా చలో తిరుపతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పెనుమూరు క్రాస్ వద్ద గల అయ్యప్పగార్డెన్ నుంచి ర్యాలీని విజయానందరెడ్డి, పార్లమెంట్ కార్యదర్శి రెడ్డెప్పతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత
ప్రభుత్వ వెద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వారికి, కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని చూడడం సరికాదని విజయానందరెడ్డి దుయ్యబట్టారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం నియోజవర్గంలో విజయవంతంగా నిర్వహించామన్నారు. చిత్తూరు నుంచి 62,500 సంతకాల పత్రులను ఈనెల 10న తిరుపతిలో జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డికి అందజేసినట్లు గుర్తుచేశారు. జిల్లా నుంచి సేకరించిన సంతకాలను తిరుపతి నుంచి విజయవాడకు పంపనున్న నేపథ్యం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకరరెడ్డి ర్యాలీకి సంఘీభావంగా తిరుపతికి వెళుతున్నామన్నారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, చుడా మాజీ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, గుడిపాల పార్టీ మండల అధ్యక్షుడు ప్రకాష్, రూరల్ పార్టీ అధ్యక్షుడు జయపాల్, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, నాయకులు రాహుల్‌రెడ్డి, అంజలిరెడ్డి, భాగ్యలక్ష్మి, హరీషారెడ్డి, మధురెడ్డి, నారాయణ, ఆను, చాన్‌బాషా, శివ, కృష్ణారెడ్డి, హేమారెడ్డి, శిరీష్‌రెడ్డి, అన్బు, లక్ష్మణస్వామి, మనోజ్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, అల్తాఫ్, అప్పొజీ, వెంకటేష్, శివారెడ్డి, రాంగణేష్, రజనీకాంత్, అమర్‌నాథరెడ్డి, త్యాగ, టిమ్ము, మధు, ప్రతిమారెడ్డి పాల్గొన్నారు.
150 కార్లతో భారీ ర్యాలీగా తిరుపతికి వెళ్తున్న నాయకులు
జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న విజయానందరెడ్డి, రెడ్డెప్ప
చలో తిరుపతికి 150 కార్లతో ర్యాలీ


