సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దు
పుంగనూరు: సైబర్ నేరగాళ్లు మున్సిపాలిటీలో కమిషనర్ పేరుతో పన్నులు ఫోన్‌పేకు పంపాలంటూ సోమవారం ఉదయం నుంచి ఫోన్లు చేయడంతో భవన యజమానులు బెంబేలెత్తిపోయారు. ఈ విషయంపై కమిషనర్ మధుసూదన్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. పన్ను వసూళ్ల కోసం సచివాలయ ఉద్యోగులు, మున్సి పల్ సిబ్బంది నేరుగా సంప్రదిస్తారని, బకాయి లు మున్సిపల్ కార్యాలయంలో చెల్లించాలని కోరారు. సైబర్ నేరగాళ్లు చెప్పే మాటలకు మోసపోయి, పన్నులు ఫోన్‌పే ద్వారా చెల్లించవద్దని, ఫోన్ రాగానే విచారించి, అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలని, ఎవరు మోసపోవ ద్దని తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు.
21న పల్స్‌పోలియో
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో ఈనెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఐఓ హనుమంతరావు సిబ్బందిని ఆదేశించారు. చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవా రం పల్స్ పోలియో రూట్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు కచ్చితంగా రెండు చుక్క లు వేయించాలన్నారు. ఇందుకు ముందస్తు ప్రణాళికలు ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 221502 ఐదేళ్ల లోపు పిల్లలున్నారన్నారు. వీరందరికీ 14,730 వైల్స్ అవసరమవుతోందన్నారు. 142 రూట్లల్లో 5,794 బూత్‌ల ద్వారా పల్స్ పోలియో వేయనున్నట్టు తెలిపారు. సీడీపీఓలు, ఎంఈవోలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తారన్నారు. శిక్షణలో ఎస్‌ఓ జార్జ్, వైద్యాధికారులు పాల్గొన్నారు.
రైతులకు కావాల్సినంత యూరియా
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రబీ సీజన్‌కు అవసరమైన మేర యూరియా అందించేందుకు ప్రణాళికలు సిద్ధంచేశామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. 20,183 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు చేశామన్నారు. గత రెండు నెలల వ్యవధిలో 4,127 మెట్రిక్ టన్నుల యూ రియా సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం 1,247 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. డీలర్లు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఆన్‌లైన్ సేవలను
సద్వినియోగం చేసుకోండి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో స్వామివారి దర్శనార్థం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈవో పెంచలకిషోర్ తెలిపారు. స్వామి దర్శనంతో పాటు సేవలు, ప్రసాదం, వసతి బుకింగ్ సేవలు కూడా ఆన్‌లైన్ ద్వారానే పొందవచ్చన్నారు. వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి
చిత్తూరు కలెక్టరేట్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఇందన పొదుపును పాటించాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. డీఆర్‌వో మోహన్‌కుమార్, ట్రాన్స్‌కో ఈఈ మునిచంద్ర, డీఈ ప్రసాద్ పాల్గొన్నారు.
జిల్లాలో
ఒక స్క్రబ్‌టైఫస్ కేసు
కాణిపాకం: జిల్లాలో సోమవారం ఒక స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. ఐరాల మండలానికి చెందిన ఓ వ్యక్తి తీవ్ర జ్వరంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు స్క్రబ్ టైఫస్‌గా నిర్థారించారు. కాగా జిల్లాలో ఇప్పటివరకు 435 కేసులు దాటాయని అధికారులు చెబుతున్నారు.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దు


