భూ..చిత్తు..!
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జింతాత..చిత..చిత..జింతాతత అంటూ ఓ తెలుగు యువత భూ మాయలొడయ్యాడు. ఊరిలో కాపుకాసి ఓ మహిళ అనుభవంలో ఉన్న భూమికి ఎసురు పెట్టించాడు. ఆ మహిళా లబోదిబోమని ఊరంతా భూ బాగోతాన్ని బహిర్గతం చేయడంతో జింతాత..చిత..చిత..జింతాతతా కథ ఊరంతా ప్రచారమైంది. బాధితుల వివరాల మేరకు ...చిత్తూరు మండలం దిగువమాసాపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు వంశపారంపర్యంగా వరించిన 5 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి ప్రస్తుతం ఖాళీగా ఉంది. పిచ్చిమొక్కలు మొలిచి ఏపుగా పెరిగింది. సెంటు రూ.2 లక్షలు పలుకుతోంది. దీనిపై తెలుగు యువతకు కన్ను పడింది. భూమిని కొట్టేయాలని ఇద్దరు టీడీపీ నాయకులను మురిపించాడు. తాచుపాముల వలే వారి వెంట పడ్డారు. అధికారుల లైన్ క్లియర్ చేసుకున్నాడు. ఆ 5 సెంట్లను భూమిని ఏకంగా మూడు నెలలకు ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ స్థలంపై గతవారం బాధితురాలికి..పక్కంటివాళ్లకు మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇంతలోనే ఆక్రమించుకున్న యువత అక్కడి చేరుకుని..ఇది తనభూమి అని చెప్పడంతో బాధితురాలు అవాకై ్కంది. తీరా అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించింది. ఇదంతా ఓ రెవెన్యూ అధికారి సహకారంతో జరిగిందని, సర్వేయర్ రిపోర్టు లేకుండా రిజిస్ట్రేషన్ చేశారని బాధితురాలు కన్నీటి పర్యంతమవుతోంది. ఈవిషయం తెలుసుకున్న బదిలీపై వెళ్లిన ఆ రెవెన్యూ అధికారి బాధితురాలిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవద్దని వేడుకుంటున్నారని, సోమవారం కచ్చితంగా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితురాలు చెబుతోంది. కాగా ఇలాంటి భూ మాయలు చాలానే జరిగాయని, అందుకే ఆ అధికారిపై బదిలీ వేటు పడిందనే విమర్శలు వస్తున్నాయి.


