గుడిసెల్లో దుర్భర జీవితం
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
పొలం పనులకు రాకపోతే దౌర్జన్యం
గుడిసెలు పీకేస్తూ..
పంటలు దున్నేస్తున్న వైనం
అగ్ర అహంకారంపై ఫిర్యాదు చేసినా కన్నెత్తి చూడని అధికార గణం
చంద్రబాబు సొంత
నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి
టీటీడీ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ
తిరుపతి రూరల్ మండలం, ఎస్వీ నగర్‌లో నివాసముంటున్న టీటీడీ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ చోటుచేసుకుంది.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో దొరల రాజ్యం నడుస్తోంది. అగ్రవర్ణాల అహంకారం రాజ్యమేలుతోంది. గిరిజనులు పొలం పనులకు వెళితే కూలి తక్కువగా ఇవ్వడం.. ఏమని అడిగితే వారిపై దౌర్జన్యం చేయడం అలవాటుగా మారింది. అప్పుసప్పు చేసి వేసుకున్న కొద్దిపాటి పంటలను దున్నేయడం.. గుడిసెలు పీకేస్తామంటూ బెదిరింపులకు దిగడం నిత్యకృత్యంగా మారుతోంది. వీరిపై కక్షగట్టిన అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి గిరిపుత్రులకు ఒక్క సంక్షేమ పథకం కూడా అందకుండా వేధించడం విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ 24 మంది పిల్లలు ఉంటే ఏ ఒక్కరికీ కనీసం ఆధార్ కార్డుకూడా లేదంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరూ స్పందించకపోవడం కొసమెరుపు.
రోజంతా పనిచేస్తే రూ.100 ఇస్తారు
ఏళ్ల తరబడి మేము కూలి పనులు చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నాం. దాసేగానూరు గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి సక్రమంగా కూలి డబ్బులు ఇవ్వడం లేదు. ఇప్పుడు మగోనికి రూ.500, ఆడవాల్లకు రూ.350 కూలి ఇస్తున్నారు. అయితే ఆ పెద్ద మనిషి రోజంతా పని చేయించుకుని మగవాళ్లకు రూ.200, ఆడవాళ్లకు రూ.100 ఇస్తావుండాడు. అందువల్ల మేమెవ్వరం కూలి పనులకు వెళ్లడం లేదు. ఆయన మాపై కక్షగట్టి గుడిసెలు కూల్చేస్తామని బెదిరిస్తున్నాడు. 30 ఏళ్లుగా గుట్టపై గుడిసెలు వేసుకుని బతుకుతున్నాం. ఇప్పుడు మా ఇళ్లు కూల్చేస్తే మేమెలా బతికేది..?.
– కనకరాజ్, ఎస్టీ కాలనీ, దాసేగానూరు
ఉలవ పంట దున్నేశారు
మా ఇళ్ల పక్కలో ఉన్న భూముల్లో ఉలవ పంట సాగుచేశాం. రాత్రికి రాత్రే ట్రాక్టర్లు పెట్టి పంటను దున్నేశారు. ఈ భూమికి పట్టా తీసి ఇస్తాం.. మాకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రూ.16 వేలు ఇచ్చాం. మళ్లీ ఇనప్పుడు రెండున్నర లక్షలు ఇవ్వాలని అడుగుతున్నారు. 30ఏళ్లుగా మమ్మల్ని ఎవ్వరూ ఇంత టార్చర్ చేయలేదు. మా పిల్లలకు ఆధార్ కార్డులు కూడా ఇవ్వలేదు. మాకు ఇప్పటి వరుకు ఒక్క సంక్షేమ పథకం కూడా అందలేదు. మా గోడు ఎవరు పట్టించుకుంటారు..?
– కనకమ్మ, ఎస్టీ కాలనీ, దాసేగానూరు
రోజూ నరకమే
వ్యవసాయ పనులకు వెళితే గిట్టుబాటు కావ డం లేదు. కూలి తక్కువ గా ఇస్తున్నారు. చెప్పిన ట్లు వినడం లేదని రోజూ నరకం చూపుతున్నారు. మాకు ప్రభు త్వం నుంచి ఎలాంటి ఆదరణా లేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. ఇంకా మీరు ఒత్తిడి చేస్తే ఆత్మహత్యలే శరణ్యం. – వెంకటపతి, ఎస్టీ కాలనీ, దాసేగానూరు
కుప్పంలో
దొరల రాజ్యం!
కుప్పం: దొరలంటే తెలంగాణ గుర్తుకొస్తుంది. వారు పెట్టే చిత్ర హింసలు, బాధలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలే సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో చోటు చేసుకుంటున్నాయి. మూడు దశాబ్దాలుగా గుట్టల మధ్య గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న ఎస్టీలపై పెత్తనం చలాయించడం విమర్శలకు తావిస్తోంది. కూలి పనులకు రాకపోతే దౌర్జన్యం చేయడం.. రాత్రికి రాత్రే పంటలు దున్నేయడం ఇక్కడి అగ్రవర్ణాల వారికి అలవాటుగా మారింది. అది ఎక్కడ.. ఎందుకో మీరే చదవండి..
కూలి తక్కువ.. పనులెక్కువ
దాసేగానూరు పంచాయతీలో ఓ పెద్దమనిషి గిరిజనులపై కక్షగట్టాడు. తన పొలం పనులకు వెళ్లే గిరిజనులకు తక్కువ కూలి ఇవ్వడం ప్రారంభించాడు. దీన్ని ఎదిరించినందుకు దౌర్జన్యాలకు దిగుతున్నా డు. తమ పొలం పక్కనున్న డీకేటీ భూములు మీ గుడిసెలు ఉన్నాయి.. నాకు పనికి రాకపోతే వాటిని తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. కడుపు మాడ్చుకుని రోజంతా కాయకష్టం చేయలేక కూలి పనులకెళ్లడమే మానేసినట్టు గిరిజనులు చెబుతున్నారు.
డబ్బులు కడితే పట్టాలిప్పిస్తాం
మీ ఇల్లు, పొలాలు డీకేటీ భూముల్లో ఉన్నాయి. మేము అడిగినంత డబ్బులిస్తే మీ ఇల్లు, పొలాలకు పట్టాలు తీసిస్తాం.. అంటూ ఎస్టీలను నమ్మిస్తున్నా రు. వారి మాటలు విని ఇప్పటికే రూ.16 వేలు ఇచ్చామని, ఇప్పుడు రూ.2.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒక వేళ వారు అడినంత ఇవ్వలేకపోతే ఏం చేస్తారో..నన్న భయం కలుగుతోందని ఆవేదన చెందుతున్నారు.
దాసేగానూరు
ఎస్టీల బతుకులు దుర్భరం
కుప్పం మండలం పరిధిలోని దాసేగానూరు పంచాయతీకి విసిరేసినట్టు మూడు కిలోమీటర్ల దూరంలో ఎస్టీ కాలనీ ఉంది. అటవీ ప్రాతంలోని గుట్ట పోరంబోలో కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ 30 కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు. కాలనీలో కనీస వసతులు లేవు. రోడ్డు సౌకర్యం లేదు. ఈ కాలనీలో 24మంది బడిఈడు పిల్లలు ఉన్నారు. వీరికి కనీసం ఆధార్ కార్డు కూడా లేదు. ఫలితంగా పలకా బలపం పట్టి బడికి వెళ్లాల్సిన వారు చదవుకు దూరమవుతున్నారు. కాలనీలో సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు విన్నవించినా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్డీఓ, పోలీసులకు రెండు నెలలుగా ఫిర్యాదు చేస్తున్నామని.. కానీ ఎవ్వరూ తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
పొలం పనులకు రాకపోతే అంతే!
దాసేగానూరు పంచాయతీలోని అగ్రవర్ణాల వారి అహంకారం పెచ్చుమీరుతోంది. పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీ వాసులు పొలం పనులకు రాకపోతే దాడులు చేయడం, దౌర్జన్యంగా పంట పొలాలు దున్నేయడం నిత్యకృత్యంగా మారుతోంది. ఇళ్లు కూల్చేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్టు స్థానికులు కంటతడి పెడుతున్నారు. ‘మా పొలాల పక్కనే ఉన్న డీకేటీ భూముల్లో గుడిసెలు ఉన్నాయని, వాటిని కూల్చేస్తాం’ అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. ‘మీ ఇల్లు.. పొలాలు ఉండాలంటే మాకు కూలి పనులకు రండి.. లేదంటే అంతే..! అంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
గుడిసెల్లో దుర్భర జీవితం
గుడిసెల్లో దుర్భర జీవితం
గుడిసెల్లో దుర్భర జీవితం
గుడిసెల్లో దుర్భర జీవితం


