ప్రజా పాలనలో బాబు విఫలం
రొంపిచెర్ల: ప్రజా పాలనలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన రొంపిచెర్ల మండలంలో శుక్రవారం పర్యటించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూపర్‌సిక్స్ పథకాల పేరుతో ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని తెలిపారు. సూపర్‌సిక్స్ పథకాలు టీడీపీ కార్యకర్తలకు మాత్రమే అందే విధంగా చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయం ప్రజలకు బాగా అర్థమైందన్నారు. 18 నెలల కాలంలో చంద్రబాబు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర లేక అప్పులపాలవుతున్నారని విమర్శించారు. వరి, మామిడి, టమాట, నిమ్మ, అరటి పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. గిట్టుబాటు ధర అడిగితే వ్యవసాయం చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదని.. అందరు మానుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ప్రజలు, రైతులు, ఉద్యోగులు ఇప్పుటికే విసిగిపోయారని అన్నారు. 18 నెలలకే ఇంత వ్యతిరేకత కనపడడం నేను ఎక్కడా చూడలేదన్నారు. ప్రజలు, రైతులకు, ఉద్యోగులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని తెలిపారు.
రొంపిచెర్ల మండలంలో పర్యటిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
జగడంవారిపల్లెలో రాజమ్మను పరామర్శిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి
కార్యకర్తలకు పరామర్శ
రొంపిచెర్ల మండలంలో కష్టల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కుటుంబాలను మాజీ మంత్రి పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందిన గానుగచింత గ్రామ పంచాయతీ, జగడంవారిపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు హరినాథ్ తల్లి రాజమ్మను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన గానుగచింత నగిరిలో షఫీని పరామర్శించారు. కమ్మపల్లెకు చెందిన మునిరత్నం నాయుడును పరామర్శించారు. అలాగే ఎన్నికల అనంతరం టీడీపీ కార్యకర్తలు కూల్చి వేసిన బొమ్మయ్యగారిపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు కరుణాకర్ పట్టు పురుగుల షెడ్‌ను పరిశీలించారు. తమపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రికి వివరించారు. తాను అండగా ఉంటానని పెద్దిరెడ్డి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, జెడ్పీటీసీ రెడ్డిశ్వర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు సలీంబాషా, చెంచురెడ్డి, కరీముల్లా, కోటా వెంకటరమణ, చింతల ద్వారకనాథరెడ్డి, సూర్య నారాయణరెడ్డి, కమలాకర్‌రెడ్డి, హరికృష్ణారెడ్డి, శంకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి దేవేంద్రరెడ్డి, విజయశేఖర్, ప్రేనంధం, రవీంద్ర, అమరనాథరెడ్డి, రాసారాయ నాయుడు, కుమార్‌నాయుడు, రాజాసాహెబ్, మహబుబ్‌బాషా, అల్లాబక్స్, బావాజీ, సైపూల్లాఖాన్, ఓబులేసు, యర్రం రెడ్డి, పాల్గొన్నారు.
ప్రజా పాలనలో బాబు విఫలం


