నేడు యువజన విభాగం బలోపేతంపై సమావేశం
తిరుపతి మంగళం : వైఎస్సార్ సీపీ యువజన విభాగాన్ని బలోపేతం చేసేందుకు తిరుపతిలోని డీపీఆర్ కల్యాణ మండపంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఐదు జిల్లాల పార్టీ యువజన విభాగం నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల యువజన విభా గం అధ్యక్షులు ఉదయ్‌వంశీ తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం బలోపేతంపై ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూ రు, అన్నమయ్య జిల్లాల యువజన విభాగం రాష్ట్ర కమిటీ, జిల్లాల అధ్యక్షులు, నగర, మండల యువజన విభాగం నాయకులు ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు.
14న అండర్–12 బాయ్స్ క్రికెట్ జట్టు ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : అండర్–12 బాయ్స్ క్రికెట్ జిల్లా జట్టు ఎంపిక పోటీలను ఈ నెల 14వ తేదీ ఉదయం 9గంటలకు నిర్వహించనున్నట్లు ఉమ్మ డి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సీడీసీఏ) కార్యదర్శి మందపాటి సతీష్‌యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక పోటీలను తిరుపతి, చిత్తూరు, పీలేరులో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి డివిజన్‌కు సంబంధించి మంగళం రోడ్డులోని సీవీ క్రికెట్ అకాడమీలో, చిత్తూరు డివిజన్‌కు సంబంధించి చిత్తూరులోని పోలీస్ గ్రౌండ్‌లో, మదనపల్లి డివిజన్‌కు సంబంధించి పీలేరులోని పీఐఓసీ క్రికెట్ నెట్స్‌లో ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రికెటర్లు 01–09–2013 సెప్టెంబర్ ఒకటో తేదీలోపు జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వారి డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఎంపిక ప్రక్రియ ప్రాంగణంలో హాజరుకావాలని, అలాగే తెల్లని దుస్తులు, సొంత క్రీడా సామగ్రి, ఆధార్‌కా ర్డు, బర్త్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 88861 85559, 90002 14966 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
క్రిస్మస్, న్యూఇయర్‌కు
ప్రత్యేక రైళ్లు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: క్రిస్మస్‌తోపాటు న్యూఇయర్ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పలు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు ఏపీ, తెలంగాణ మీదుగా నడుస్తాయి. ఈ ప్రత్యేక రైలు ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు తిరుపతి – చర్లపల్లి మధ్య నడవనుంది. ప్రతి మంగళవారం సాయంత్రం 4.30కు తిరుపతి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.15కు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు మల్కాజ్‌గిరి, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, కర్నూ ల్, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎరగ్రుంట, కడప, రాజంపేట స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి–తిరుపతి ట్రైన్ (07031) ఈ నెల 19 నుంచి జనవరి 2 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్రవారం చర్లపల్లిలో సాయంత్రం 3.35కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40కు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, దోమకొండ, వినుకొండ, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. పందార్‌పూర్–తిరుపతి రైలు (07032) ఈ నెల 21 నుంచి జనవరి 4 వరకు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు పందార్‌పూర్‌లో ఈ రైలు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు జహీరాబాద్, వికారాబాద్, శంకర్ పల్లి, లింగంపల్లి, రేణిగుంట, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, బాపట్ల, ఒంగోలు మీదుగా ప్రయాణిస్తుంది.


