అది గెలుపేనా?
ఫ్యాన్ గుర్తుపై గెలిచి వెళ్లిన వారు
దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి
పోలీసులు, అధికారుల అండ తో
గెలవడం గెలుపేకాదు
మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజం
నగరి : ప్రస్తుతం నిండ్ర, విజయపురం మండలాల్లో నిర్వహించిన ఎంిపీపీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నిర్వహించిన ఎన్నికలని, అందులో గెలిచినవారు పొలిటికల్ బఫూన్లని మాజీ మంత్రి ఆర్కేరోజా ధ్వజమెత్తారు. ఎంపీపీ ఎన్నికలు జరిగిన తీరు పై గురువారం ఆమె మీడియా సమక్షంగా తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను వెన్నపోటు రాజకీయాలు చేసి నిర్వహించారన్నారు. టీడీపీ నేతలు రౌడీయిజం చేసి లోపలకు వెళుతుంటూ చోద్యం చూసిన డీఎస్పీ, సీఐ, పోలీసు లు వైఎస్సార్‌సీపీకి 144 సెక్షన్ అంటూ దూరంగా పంపేశారన్నారు. విజయపురం మండలంలో 8 ఎంపీటీసీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవే అని, నిండ్ర మండలంలో 7 ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీవేనని.. వీరంద రూ ఫ్యాన్‌గుర్తుపై గెలిచినవారే అని ఆమె గుర్తుచేశా రు. నేడు వారు టీడీపీ అంటున్నారంటే ఎలాంటి నీచరాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుస్తోందన్నా రు. పోలీసులు, అధికారులను అడ్డంపెట్టుకొని మీడియాను దూరంగా పెట్టి ఎన్నికలు జరిపించిన తీరే ఈ ఎన్నికలు ఎలా జరిగాయో చెప్పడానికి నిదర్శనమన్నా రు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను నామినేషన్ వేయడానికి వీల్లేకుండా అధికారులు వేధించారన్నారు. రెండు పార్టీలకు సమాన బలం వచ్చి టై అయితే లక్కీడిప్ పెట్టి ఎన్నుకోవాల్సి ఉంటే నిండ్రలో ఇద్దరు పోటీచేస్తే పది పేపర్లు భాస్కర్‌రెడ్డి అని రాసి వేశారని, దీంతో ఆ పేరే వచ్చిందని, విజయపురంలో లక్కీడిప్ చిన్న బిడ్డ తో తీయమని చెప్పారని, అలాతీస్తే మంజు బాలాజీ అని పేరువస్తే అధికారులు లక్ష్మీపతి రాజు అని ప్రకటించారన్నారు. అక్కడే ఉన్న మంజు బాలాజీ పేపర్‌ను తీసి తన పేరు ఉన్నట్లు అక్కడి కెమెరాలకు కూడా చూపడం జరిగిందన్నారు. అయినా అధికారులు లక్ష్మీపతిరాజు పేరే ప్రకటించడం దేశ చరిత్రలో జరగని నీచ సంఘటన అన్నారు. ఇలా జరుగుతుందని ముందే అధికారులకు తెలుసుకనుకే మీడియాను అనుమతించలేదన్నారు. క్రాకర్స్, పూలదండలు కూడా రెడీగా ఉంచుకున్నారంటే అధికారులు గెలిపిస్తారని వీరికి ముందే తెలిసినట్లుందన్నారు.
పనికిమాలిన రాజకీయాలు చేస్తే..
పనికిమాలిన రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి హెచ్చరించారు. జగనన్న ఫొటోతో, వైఎస్సార్‌సీపీ ఇచ్చిన బీఫాంతో, ఫ్యాన్ గుర్తుపై గెలిచి, నేడు టీడీపీ పంచన చేరడం తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టే అన్నారు. వారికి దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి టీడీపీ గుర్తుపై గెలవాలన్నారు. వీరిని చూసి ఎవ్వరూ ఓటెయ్య లేదన్నారు. పార్టీని చూసి నాయకులు, కార్యకర్తలు పనిచేస్తే వీరు గెలిచారన్నారు. ఇలా చేసిన వారికి రాజకీయ సమాధి తప్పదన్నారు. ఎన్నికల వ్యవహారంలో ఉన్న అధికారులను, పోలీసులను వదిలిపెట్టే ప్రశక్తే లేదన్నారు.
గెలిచిన వారు
పొలిటికల్ బఫూన్లు


