అల్లియల్లమ్మ ఆలయంలో రష్యన్ దేశస్తులు
గంగాధర నెల్లూరు: మండల కేంద్రంలో కొలువైన అల్లియల్లమ్మ తల్లి ఆలయంలో రష్యన్ దేశస్తులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతదేశ పర్యటనలో భాగంగా రష్యా దేశానికి చెందిన పది మంది వరకు సంప్రదాయ దుస్తులు ధరించి అల్లి ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ఆనంద అయ్యంగార్ ఆధ్వర్యంలో నాగ ప్రతిష్ట, నాగ హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ మాజీ ధర్మకర్త రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.
కరెంట్ ఉచ్చు వేసిన వ్యక్తి అరెస్ట్
బంగారుపాళెం: అడవి పందుల కోసం వేసిన కరెంటు ఉచ్చు పడి ఇద్దరు వ్యక్తులు మృతికి కారకుడైన వ్యక్తిని గురువారం సాయంత్రం అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని బండ్లదొడ్డి గ్రామంలో ఈ నెల 3న రైతుల మామిడితోటలో అడవి పందులను వేటాడేందుకు ఏర్పాటు చేసిన కరెంటు ఉచ్చుకు అదే గ్రామానికి చెందిన ఇద్దరు యానాదులు మృతి చెందారు. కన్నయ్య కుమారుడు రామరాజు కరంటు ఉచ్చును అక్రమంగా వేయడం కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు రామరాజును బలిజపల్లె అండర్ బ్రిడ్జి వద్ద అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
అల్లియల్లమ్మ ఆలయంలో రష్యన్ దేశస్తులు


