బంగారుపాళెం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 జాతీ య వాలీబాల్ పోటీలకు బంగారు పాళ్యానికి చెందిన విద్యార్థి ఎంపికై నట్లు కుటంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన దావూద్‌ఖాన్ కుమారుడు రమాన్‌ఖాన్ పలమనేరులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువు తున్నా డు. పలమనేరు పట్టణంలో ఈ నెల ఒకటిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలలో జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. పోటీలలో రహమాన్‌ఖాన్ ప్రతిభ చాటడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారని తెలిపారు. రహమాన్‌ఖాన్‌ను జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్‌రాజా, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి సుదర్శన్‌నాయుడు, సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు మురారి అభినందించారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఐరాల: వికలాంగుల మోటారు మూడు చక్రాల వాహనాల మంజూరుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించినట్లు మండలానికి చెందిన ఏపీ వికలాంగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.. జిల్లాలోని నియోజకవర్గాలకు 10 చొప్పున మూడు చక్రాల మోటారు వాహనాలు మంజూరు చేసినట్లు చెప్పారు. అర్హులైన అభ్యర్థు ల దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తారన్నా రు. దరఖాస్తులు WWW.apdascsc.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ఈ నెల 25వ తేదీ లోపు నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థుల వయసు ఈనెల 25 నాటికి 18 నుంచి 45 సంవత్సారాల మధ్య ఉండాలని తెలిపారు. సదరం ధ్రువీకరణ పత్రం ప్రకారం కాళ్లలో ( దిగువ అవయవాలు) 70 శాతం కంటే ఎక్కువ వికలత్వం ఉండాలన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే ఎక్కువ కాకూడదని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. గతంలో మోటరైజ్డ్ వాహనం పొందని వారు అర్హులని తెలిపారు. వేతనం పొందుతూ కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉన్నవారు సంబంధిత ధృవీకరణ పత్రం జత చేయాలని సూచించారు.
చిత్తూరు అర్బన్: చిత్తూరు సంతపేటలోని ఇందిరానగర్లో గురువారం రాత్రి భారీగా వరద నీరు చేరింది. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఈ ప్రాంతాల్లోని చెరువులకు వర్షపు నీరు చేరింది. వాటి నుంచి నీళ్లంతా లోతట్టు ప్రాంతమైన ఇందిరానగర్‌లో ప్రవహిస్తోంది. ఉన్నట్టుండి వరద నీరు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక


