సదుంలో కేంద్ర బృందం పర్యటన
సదుం: సదుం మండలంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బృందం గురువారం పర్యటించింది. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించింది. ఆస్పత్రిలోని ప్రతి విభాగాన్ని పరిశీలించి రోగులు, గర్భిణులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసింది. ఎంపీ మిథున్‌రెడ్డి నిధులతో నిర్మిస్తు న్న డయాలసిస్, మార్చురీ భవనాలను పరిశీలించారు. బయో మెడికల్ వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతులతో ధ్వంసం చేయాలని సూచించారు. ఆస్పత్రిలో సిబ్బంది, పరికరాలు, నిధుల కొరత ఉన్నట్లు హెచ్‌డీసీ సభ్యుడు కృష్ణారెడ్డి బృందం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం నడిగడ్డలోని విలేజ్ హెల్త్ క్లినిక్, అంగన్‌వాడీ, పాఠశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్ డాక్టర్ జోయా ఆలీ రిజ్వీ, డీఎంహెచ్‌వో సుధారాణి, డీసీహెచ్‌ఎస్ పద్మాంజలి, వైద్య, ఆరోగ్యశాఖ జేడీ నిర్మలా గ్లోరీ, టీబీ జిల్లా అధికారి డాక్టరు వెంకటప్రసాద్, బృంద సభ్యులు అర్పిత, హరికృష్ణ, పార్వతి, సీవీఎస్ రాయుడు, రమణ, సీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టరు ప్రసాద్‌రాజు, పుష్పకుమారి తదితరులు పాల్గొన్నారు.
సదుంలో కేంద్ర బృందం పర్యటన


