రైలు ఢీకొని మహిళ మృతి
క్లుప్తంగా
కుప్పంరూరల్ : రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలోని ఫ్‌లై ఓవర్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ రమేష్ కథనం మేరకు వివరాలిలా. సుమారు 45 ఏళ్ల వయస్సు కలిగి న మహిళ ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రైలు ఢీకొని మృతి చెందింది. తెల్ల చీర కట్టుకుని ఉన్న మహిళ తప్పిపోయి ఉంటే కుప్పం రైల్వే అధికారులను సంప్రదించాలని కోరారు. గుర్తు తెలిస్తే రైల్వే పోలీసులు 9000716436, 8074088806 నంబర్లను సంప్రదించాలని కోరారు.
అంత్యక్రియలకు వెళ్లి..
అనంత లోకాలకు
ఐరాల: బంధువుల అంత్యక్రియలకు వెళ్లి ద్విచక్రవాహనంలో వస్తూ డివైడర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. కాణిపాకం ఎస్‌ఐ నరసింహులు కథనం మేరకు.. తవణంపల్లె మండలం ఎగువ తవణంపల్లెకు చెందిన పి.నాగరాజ(45) ఉదయం పూతలపట్టు మండలం బూచేపల్లెలో బంధువు అంత్యక్రియలకు ద్విక్రవాహనంలో వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో చిగరపల్లె హైవే బ్రిడ్జి వద్ద అతివేగంతో డివైడర్‌ను ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య విజయనిర్మల, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైలు ఢీకొని మహిళ మృతి


