పంటలపై ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని దేవళంపేట పంచాయతీ దిగువమూర్తి వారిపల్లెలోని పంటలపై ఆదివారం తెల్లవారుజామున ఏనుగులు దాడి చేశాయి. రాగి పంటను తొక్కి నాశనం చేశాయి. చేతికి వచ్చిన సమయంలో పంటలు దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏనుగులు పంట పొలాల్లోకి రాకుండా కట్టడి చేయాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.
సర్టిఫికెట్ల పరిశీలన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం సహిత విద్య కో ఆర్డినేటర్ (ఐఈఆర్‌పీ)ల సర్టిఫికెట్‌ల పరిశీలన నిర్వహించారు. కో–ఆర్డినేటర్ల రెగ్యులర్ పే స్కేల్ నిమిత్తం ఈ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియను డీఈవో వరలక్ష్మి, సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ పర్యవేక్షించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని భవిత కేంద్రాల్లో పనిచేస్తున్న సహిత విద్య కో–ఆర్డినేటర్‌లు హాజరయ్యారు.
పంటలపై ఏనుగుల దాడి


