పోలీసు ఆయుధాలు.. పరికరాల ప్రదర్శన
చిత్తూరు అర్బన్ : పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆదివారం చిత్తూరులోని ఏఆర్ కార్యాలయంలో పోలీసులు ఉపయోగించే ఆయుధాలు.. పరికరాలను సందర్శకుల కోసం ఉంచా రు. ఎస్పీ తుషార్ డూడీ ఓపెన్ హౌస్‌ను ప్రారంభించా రు. ఇందులో పోలీసులు ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్ కెమెరాలు, కెమెరాలతో భద్రత పర్యవేక్షించే వాహనాలు, పోలీసు జాగిలాలను విద్యార్థులు, ప్రజలకు చూపించారు. ఆయుధాలను ఎలా ఉపయోగిస్తారు..? వాటి రేంజ్ ఏంటి..? ఒక్కసారి కాలిస్తే ఎన్ని బుల్లెట్లు వెళతాయి..? తదితర వివరాలను విద్యార్థులకు ఎస్పీ స్వయంగా వివరించారు.


