
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
– ముగ్గురికి తీవ్ర గాయాలు
శ్రీరంగరాజపురం : రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెంది, ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారి సంగం పాల డెయిరీ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు పెనుమూరు మండలం ఒడ్డుపల్లి గ్రామానికి చెందిన హేమాద్రి(36), ప్రసాద్(54), రమేష్(47) తన స్నేహితులతో కలిసి పళ్లిపట్టుకు ఆటోలో వెళ్తుండగా గంగాధర నెల్లూరు మండలం వేటుకురుపల్లి గ్రామానికి చెందిన ఏ.సుబ్రమణ్యం (60) కార్వేటినగరం పాదిరికుప్పంలో తమ సమీప బంధువుల ఇంటికి వెళ్లి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో తిరిగి వస్తుండగా మార్గమధ్యలో సంగం పాలడెయిరీ వద్ద ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో సుబ్రమణ్యంకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు 108 వాహనం ద్వారా గాయపడిన క్షతగాత్రులను స్థానికుల సహాయంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సీఎంసీకి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.