
మహిళపై దాడి
శాంతిపురం : తమ వ్యవసా య భూమిని ఆక్రమించుకున్న వారిని అడ్డగించేందుకు వెళ్లిన తనపై దాడి చేశారని ఓ మహిళ రాళ్లబూదుగూరు పోలీసులను ఆశ్రయించింది. శనివారం జరిగిన దాడిపై బాధితురాలు ఆదివారం పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఎం.కె.పురానికి చెందిన శివమ్మ ఫిర్యాదు మేరకు వివరాలు.. కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా ఆమె ఒంటరిగా గ్రామంలో ఉంటోంది. వీరికి వారసత్వ ఆస్తిగా సంక్రమించిన దానిలో 1.45 ఎకరాలను అదే గ్రామానికి చెందిన మరో కుటుంబం ఆక్రమించుకుందని తెలిపారు. దీనిపై శివమ్మ హైకోర్టును ఆశ్రయించడంతో తన ఆస్తిని స్వాధీనం చేసుకోవటం, అనుభవించటంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయినా తనను సొంత భూమిలోనికి రానివ్వకపోవటంతో కోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఇప్పటికే జిల్లా ఎస్పీ, కుప్పం ఆర్డీవో, డీఎస్పీ, కడ పీవోలకు వినతి పత్రాలు సమర్పించానని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం తమ పొలంలో ప్రత్యర్థులు అరటి చెట్లు నాటుతున్నా రని తెలిసి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వెంకటప్ప, వెంకటమ్మ, కృష్ణమూర్తి, పుష్ప తనపై దాడికి పాల్పడ్డారని ఆమె చెప్పారు. దీనిపై పోలీసు అధికారులు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు.