
ప్రైవేటీకరణ విరమించుకోవాలి
రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాల సేకరణ అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలు, యువత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి
చిత్తూరు కార్పొరేషన్ : పాలన చేతకాక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న అసమర్థ కూటమి ప్రభుత్వాన్ని కోటి సంతకాల కార్యక్రమం ద్వారా నిలదీద్దామంటూ ప్రజలకు వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి పిలుపునిచ్చా రు. ఆదివారం చిత్తూరు నగరంలోని 34వ వార్డు కన్నయ్యనాయుడు కాలనీలో రచ్చబండలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యుడు ఆను ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ పార్లమెంట్ కార్యదర్శి, పరిశీలకులు రెడ్డెప్ప కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు నియో జకవర్గ సమన్వకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులను తీసుకొచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపు నిచ్చారు. కూటమి ప్రభు త్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి పేదల కడుపు కొడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల లు ప్రైవేటీకరణ కాకుండా ఆపేందుకు పార్టీ ఆదేశాల మేరకు చిత్తూరు నియోజకవర్గంలో 60 వేల సంతకాలు సేకరిస్తున్నామన్నా రు. సేకరించే సంతకాలను గవర్నర్, రాష్ట్రపతిలకు అందజేయనున్నట్లు తెలిపారు.
అనూహ్య స్పందన
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారిందని విజయానందరెడ్డి అన్నారు. ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, ప్రజలు తరలివచ్చి చంద్రబాబు వైఖరికి నిరసనగా సంతకాలు చేశారని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే దుర్మార్గపు ఆలోచనను చంద్రబాబు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ కార్యదర్శి, పరిశీలకులు రెడ్డెప్ప మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడం విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో విజయానందరెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా సంతకం చేశారు. అనంతరం మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాలను సేకరించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, రెడ్డెప్ప, నౌషాద్, రమణ, హరిషారెడ్డి, కౌషర్, బిందురెడ్డి, మస్తాన్, యువత, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
కోటి సంతకాల కార్యక్రమంలో సంతకాలు చేస్తున్న యువత
మాట్లాడుతున్న చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి

ప్రైవేటీకరణ విరమించుకోవాలి