
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వినాయకం అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఆ సంఘం జిల్లా నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులు భవిష్యత్‌లో ఉద్యోగాలు పొందేందుకు ఉచిత శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కచ్చితంగా అంబేడ్కర్ చిత్రపటాన్ని పెట్టాలన్నారు.
నూతన కార్యవర్గం
జిల్లా అధ్యక్షులుగా మురళి, ప్రధాన కార్యదర్శిగా భాస్కర్, గౌరవ అధ్యక్షులుగా ఓబులేశు, ఆర్థిక కార్యదర్శిగా షణ్ముగం, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా సంతానం, జిల్లా అడిషనల్ సెక్రటరీగా వినాయక, జిల్లా కన్వీనర్‌గా బాబు, జిల్లా ఉపాధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం, ప్రసాద్, రమేష్, నవీన్, నరేష్, సుబ్బలక్ష్మి, ప్రణీత, రజనీని ఎన్నుకున్నట్లు ప్రకటించారు.