
యూ‘మిస్’
పలమనేరు: మండలంలోని కళ్యాణిరేవులు జలపాతంలో రీల్స్ మోజులో దూకి నీటమునిగిన పట్టణ వాసి యూనిస్(25) మృతదేహాన్ని పలమనేరు ఫైర్ సిబ్బంది శనివారం వెలికితీశారు. మూడు రోజుల క్రితం యూనిస్ స్నేహితులతో కలిసి జలపాతం వద్ద సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసుకుంటూ భారీగా ప్రవహిస్తున్న వాటర్ ఫాల్స్‌లోకి దూకి ఆపై కనిపించకుండా పోయాడు. తమిళనాడుకు చెందిన పది మంది గజ ఈతగాళ్లు సైతం మృతదేహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. తుదకు శనివారం మధ్యాహ్నం ఘటన జరిగిన ప్రాంతం నుంచి ముందుకు కిలోమీటర్ దూరంలో సుడిగుండంలో చిక్కుకుని రాతిబండలకిందనున్న యూనిస్ మృతదేహం పైకి తేలింది. డ్రోన్ ద్వారా నదిపై గమనించగా ఈ విషయం కనిపించింది. ఆ ప్రాంతంలోకి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ఆపై స్థానిక ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి కేసు నమోదు చేస్తున్నట్టు సీఐ మురళీమోహన్ తెలిపారు. కాగా మృతదేహం కోసం స్థానిక ఫైర్ సిబ్బంది పడిన కష్టాన్ని పట్టణవాసులు అభినందించారు.

యూ‘మిస్’