
ప్రతిభకు ప్రోత్సాహం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు కౌశల్ ప్రతిభా అన్వేషణ పోటీలు దోహదపడుతాయని డీఈవో వరలక్ష్మి అన్నారు. గురువారం డీఈవో కార్యాలయంలో కౌశల్ పోటీ పరీక్షల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులను కౌశల్ 2025 క్విజ్ పోటీలకు సిద్ధం చేయాలన్నారు. భారతీయ విజ్ఞాన మండలి, ఏపీ సైన్స్ సిటీ, ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారన్నారు. ఈ పోటీలకు జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న 8,9 ,10 తరగతుల విద్యార్థులు అర్హులన్నారు. పాఠశాల స్థాయిలో నవంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు, జిల్లా స్థాయిలో 27, 28 తేదీల్లో ఈ పోటీలు నిర్వహిస్తారన్నారు. జిల్లా సమగ్ర శిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థుల్లోని ప్రతిభా పాటవాలు, సృజనాత్మకతను వెలికితీసేందుకు కౌశల్ క్విజ్ పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో ఏడీ వెంకటేశ్వరరావు, ఎంఈవోలు హసన్‌భాషా, గణపతి, కౌశల్ పోటీల నిర్వాహకులు దామోదర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, మదన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్ మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 79,919 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 28,218 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.79 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తిచేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
వినాయక సదన్ తనిఖీ
కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని వినాయక సదన్‌ను గురువారం ఈఓ పెంచల కిషోర్ తనిఖీ చేశారు. పాత సదన్‌తో పాటు కొత్తగా సముదాయాన్ని పరిశీలించారు. ఆ భవనంలోని ఫర్నీ చర్ శాంపిల్స్‌ను కూడా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.