
యువత అన్ని రంగాల్లో రాణించాలి
చిత్తూరు కలెక్టరేట్ : యువత అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని విజయం కళాశాల ప్రాంగణంలో మై భారత్ ఆధ్వర్యంలో సమితి స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లా యువజన అధికారి మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడా పోటీల్లో రాణించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్‌లు, మెడల్స్ అందజేశారు. మై భారత్ ప్రాంగీయ గణాంక అధికారి బాబురెడ్డి, విజయం కళాశాలల ఏవో రాజగోపాల్‌నాయుడు, యూత్ ఫర్ సేవా అధ్యక్షుడు హరీష్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.