
బాల్య వివాహాల కట్టడికి సహకారం
చిత్తూరు కలెక్టరేట్ : బాల్య వివాహాల కట్టడికి ప్రజాప్రతినిధుల సహకారం అవసరమని తిరుపతి ఐసీడీఎస్ పీడీ వసంత అన్నారు. గురువారం జిల్లా పరిష త్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్థాయీ సంఘాల సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో బాల్య వివాహాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాల కట్టడికి ప్రజాప్రతినిధుల సహకారం ఉంటే మరింతగా కట్టడి చేయవచ్చన్నారు. ఉమ్మడి చిత్తూరులో దాదాపు 4500 కు పైగా టీనేజీ గర్భిణులు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. యుక్త వయసులో గర్భిణులు గా మారడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయన్నారు. క్షేత్రస్థాయిలో ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు.