
కార్యకర్తల కోసమే డిజిటల్ బుక్
బంగారుపాళెం : కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న అన్యాయాలకు డిజిటల్ బుక్ సమాధానం చెబుతుందని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ అన్నా రు. గురువారం మండలంలోని నల్లంగాడు, శెట్టేరి, తూంపాయనపల్లె గ్రామ పంచాయతీలో గ్రామ కమిటీలు, అను బంధ విభాగాల కమిటీ నియాయక సమావేశాలను డాక్టర్ సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలకు గ్రామ, అనుబంధ విభాగాల కమిటీలో ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామ కమిటీలు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కష్టపడి పనిచేయాలన్నారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం ప్రభు త్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కుమార్‌రాజా, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలు లలిత కుమారి, సర్పంచ్ ధనుంజయరావు, ఉపసర్పంచ్ శంకర్, ఎంపీటీసీ ఉషశ్రీ, మాజీ సింగిల్ విండో, ఏఎంసీ అధ్యక్షులు దత్తాత్రేయరెడ్డి, కృపాసాగర్‌రెడ్డి, రాష్ట్ర సామాజిక మాధ్యమాల సంయుక్త కార్యదర్శి కిషోర్‌కుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి గోవిందరాజులు, జిల్లాట్రేడ్ యూనియన్ కార్యదర్శి రఘుపతిరాజు, సీనియర్ నాయకులు పాలాక్షిరెడ్డి, ధామస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నాగరాజ, యూత్ అధ్యక్షుడు గజేంద్ర పాల్గొన్నారు.