
సాక్షి మీడియాపై కేసులు అప్రజాస్వామికం
మీడియాపై రాజకీయ కక్ష తగదు
ప్రభుత్వం గ త నాలుగు రోజులుగా సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. పోలీసులను ముందు పెట్టి జర్నలిస్టులను భయపెట్టా లని చూస్తున్నారు. ఇలాంటి చర్యలు మీడియా స్వేచ్ఛకు మంచిది కాదు. వార్తలపై అభ్యంతరం ఉంటే చట్టపరంగా ముందుకెళ్లాలి తప్ప ఇలా కేసులతో భయపెట్టి లొంగదీసుకోవాలని చూడడం అసాధ్యం. మీడియాను రక్షించాల్సిన వ్యవస్థలే కక్ష పూరితంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. – ఆర్.మురళి, అధ్యక్షుడు, తిరుపతి ప్రెస్ క్లబ్
మీడియాకు రాజకీయ కక్ష అప్రజాస్వామికం. ప్రభుత్వ వైఫల్యాలపై సాక్షిలో కథనాలు ప్రచురించారని పత్రిక కార్యాలయాలపై పోలీసులు దాడిచేయడమేంటి? ఎడిటర్‌ను బెదిరించడం, కార్యాలయంలో సోదాలు చేయడం దారుణం. మీడియాపై అధికారులు ఇలా దాడులకు పాల్పడితే అది ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి. ఈ విధానాన్ని పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
– విజయ్ యాదవ్, జేశాప్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు

సాక్షి మీడియాపై కేసులు అప్రజాస్వామికం