
ప్రయాణికుల పడిగాపులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కర్నూలులో గురువారం జరిగే పీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు జిల్లా నుంచి 250 ఆర్టీసీ బస్సులు కేటాయించారు. ఈ బస్సులు బుధవారం ఉదయం కర్నూలుకు బయలు దేరాయి. దీంతో అత్యధిక శాతం గ్రామీణ బస్సు సర్వీసులు రద్దయ్యాయి. దీంతో పాటు ఎక్స్‌ప్రెస్, సప్తగిరి బస్సులను కూడా పంపించేశారు. దీంతో వివిధ పనుల నిమిత్తం చిత్తూరుకు వచ్చిన ప్రయాణికులు తిరిగి వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. గత్యంతరం లేక ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.
కుప్పం : పీఎం సభ జన సమీకరణ కోసం కుప్పం ఆర్టీసీ నుంచి 71 బస్సులను బుధవారం తరలించారు. కుప్పం ఆర్టీసీ డిపోలో నడస్తున్నదే కేవలం 97 సర్వీసులు వీటిలో 71 బస్సులను సభలకు కేటాయించారు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. మరో మూడు రోజులు ప్రయాణికులకు అవస్థలు తప్పేలాలేవు.

ప్రయాణికుల పడిగాపులు