
లైసెన్సులు రద్దు చేయాలి
బంగారుపాళెం: జూస్ ఫ్యాక్టరీలు ఇస్తామన్న రూ.8 ఎక్కడని రైతు సంఘం నేతలు ప్రశ్నించారు. ఆ యజమానుల లైసెన్సులు రద్దు చేయాలని రైతు సంఘ అధ్యక్షుడు జనార్దన్, ప్రధాన కార్యదర్శి మునీశ్వర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెండ్ సురేంద్ర డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం వారు మాట్లాడుతూ, మామిడి రైతుల అక్రందన సభ నేపథ్యంలో ఒక్క రోజు ముందు ప్రభుత్వం ఇస్తామన్న రూ.4 సబ్సిడీ రూ.185 కోట్లు విడుదల చేయడం సంతోషమన్నారు. అయితే ప్రభుత్వం ప్రకటన మేరకు రూ. 12 ఒకేసారి జమ చేసి ఉంటే బాగుండేదన్నారు. జిల్లా కలెక్టర్ గుజ్జు పరిశ్రమ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి నేపథ్యంలో తొలుత రూ.8 చొప్పున వారి నుంచి రైతుల అకౌంట్లకు రూ.370 కోట్లు జమ చేసి ఉంటే పూర్తి భరోసా ఉండేదన్నా రు. ఫ్యాక్టరీ యజమానులు నేటికీ ప్రభుత్వ నిర్ణయాన్ని అమ లు చేసేందుకు ముందుకు రాకపోవడం దారుణమన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫ్యాక్టరీ లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం బంగారు పాళెం మార్కెట్ యార్డు వద్ద జరిగే రైతు ఆక్రందన సభ రూ.8 రాబట్టడడంపై దృష్టి సారిస్తామన్నారు. ఫ్యాక్టరీ, ర్యాంపు నిర్వాహకులపైన ప్రత్యేక్ష పోరాటానికి సన్నద్ధమవుతామన్నారు. రైతు ఆక్రందన సభకు ఆటంకం కలిగిస్తే రైతు వ్యతిరేకులుగా ముద్రపడటం ఖాయమన్నారు. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించా రు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ రైతు ఆక్రందన సభకు సీపీఎం మద్దతు ఇస్తున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో మామిడి రైతు సంఘ నేతలు మునిరత్నంనాయుడు, శ్రీనివాస్, సంజీవరెడ్డి, మురళి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.