
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం
– పూతలపట్టు సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్
బంగారుపాళెం: కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఏకపక్ష నిర్ణయాలతో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకుందని, దానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలు చేద్దామని వైఎస్సార్ సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని తుంబపాళెం, ఈచనేరిపల్లె, పెరుమాళ్లపల్లె పంచాయతీల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీల ఎంపిక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసి, పేద విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ దుష్ట చర్యలను నిరసిస్తూ సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలను పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈనెల 10 నుంచి 22వ తేదీ వరకు గ్రామ, వార్డుల్లో రచ్చబండ, సంతకాల సేకరణ, 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలు తరలింపు, 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలింపు, గవర్నర్‌కు నివేదన, కోటి సంతకాల పత్రాల అందజేత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పార్టీ నేతలతో కలసి శ్రీవైఎస్సార్‌సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంశ్రీ వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు.
కార్యకర్తలకు భరోసా కల్పించడమే లక్ష్యం
గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు భరోసా కల్పించడమే వైఎస్సార్‌సీపీ లక్ష్యమని డాక్టర్ సునీల్‌కుమార్ అన్నారు. గ్రామస్థాయిలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత కల్పించి పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కమిటీ సభ్యులు గ్రామస్థాయిలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కష్టపడే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా గెలిపించుకునేందుకు పోరాటం సాగిద్దామన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌ న్సిల్ సభ్యురాలు లలితకుమారి, పాలఏకరి విభా గం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్‌రాజా, వైస్ ఎంపీపీ శిరీష్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు గోవిందరాజులు, ప్రకాష్‌రెడ్డి, ట్రేడ్‌యూనియన్ జిల్లా కార్యదర్శి రఘుపతిరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ కృపాసాగర్‌రెడ్డి, సోషల్ మీడియా నియోజకవర్గ అ ధ్యక్షుడు రెడ్డెప్ప, యూత్ మండల అధ్యక్షుడు గజేంద్ర, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు నాగరాజ, రై తు సంఘం మండల అధ్యక్షుడు అరుణామల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సోషల్ మీడియా మండల అధ్యక్షు డు శైలేష్, సర్పంచ్ అనురాధ, నేతలు రమేష్, హరి, దూర్వాసులు, బాలాజీ, సుధా పాల్గొన్నారు.