
తిరుమలలో తనిఖీలు
తిరుమల : తిరుమలలో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు మూడు రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో 187 మంది యాచకులు, అనధికార హాకర్లను గుర్తించి తిరుపతికి తరలించారు. అలాగే 73 మంది అనుమానితుల వేలిముద్రలను సేకరించి రికార్డులను పరిశీలించారు. తిరుమలలో పనిచేసే కార్మికులను సంబంధిత యజమానులు పనులు పూర్తి కాగానే తిరుపతికి పంపివేయాలని సూచించారు అనధికార వ్యక్తులను గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు.