
పరిహారం.. ఫలహారం!
తోటలను అమ్ముకుని మళ్లీ నష్ట పరిహారం పొందిన రైతులు మామిడితోట ఉంటే చాలు జిమ్మిక్కులతో పరిహారం హార్టికల్చర్ సిబ్బంది ప్రమేయంతో పక్కాగా మోసాలు ట్రాక్టర్ల నంబర్ ప్లేట్లు మార్చి మరీ బిల్లులు దీంతో రూ.46 కోట్ల ప్రజాధనం హుస్ కాకీ
కష్టాల సుడి నుంచి కర్షకుడిని గట్టెక్కించడానికి సర్కారు మంజూరు చేసిన సాయంలోనూ కొందరు చేతివాటం ప్రదర్శించారు. తమ తోటలను లీజు కిచ్చిన ఫలితం దక్కించుకున్న రైతులు సైతం దొంగ బిల్లులతో పరిహారం పొందారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడగా.. నిజమైన లబ్ధిదారుడికి అన్యాయం జరిగింది.
పలమనేరు: తోతాపురి రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం కిలోకి రూ.4 రాయితీ ఇస్తామని చెప్పడంతో మామిడి రైతులు ప్రభుత్వాన్ని ఎలా ఏమార్చాలో తెలుసుకుని మరీ మోసం చేశారు. వీరికి సంబంధిత హార్టికల్చర్ అధికారులు, సిబ్బంది బాగా సహకరించారు. దీంతో చిత్తూరు జిల్లాలో దాదాపు రూ.46 కోట్ల కుంభకోణం జరిగిందని తెలుస్తోంది. తోతాపురి మామిడికి ధరల లేక ప్రభుత్వం అదనంగా రూ.4 ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చాలామంది రైతులు భారీగా మోసాలకు పాల్పడ్డారు. ఫలితంగా జిల్లాలోని మామిడి రైతులకు ప్రభుత్వం నుంచి అందిన నష్టపరిహారంలో దాదాపు రూ.46 కోట్ల వరకు తప్పుడు బిల్లుల ద్వారా అక్రమాలు జరిగినట్టు సమాచారం.
మోసాలు ఎలాగంటే....
జిల్లాలోని రైతుల్లో సగం మంది మామిడి రైతులు మూడేళ్ల ఫలసాయానికి వ్యాపారులు తోటలను విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యాపారి తోటలోని కాయలను తీసుకెళ్లాడు. కానీ రైతులు తామే ఫ్యాక్టరీలకు, లేదా సంబంధిత ర్యాంపులకు తోలినట్టు కాటా, హార్టికల్చర్ సిబ్బందితో కుమ్ముకై ్క దొంగ బిల్లులతో నష్టపరిహారం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. దీంతో వీరిందరికి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందింది.
దొంగ బిల్లులకు భారీ కమీషన్లు...
ఎలాగైనా ప్రభుత్వం నుంచి అందే నష్టపరిహారాన్ని తస్కరించాలని భావించిన వారిలో 90శాతం కూటమి నాయకులే ఉన్నారు. అధికార బలాన్ని వాడిన వీరు ట్రాక్టర్ల ద్వారా ర్యాంపులకు మామిడిని అమ్మినట్టు దొంగ వేబ్రిడ్జి లెక్కలు, ట్రాక్టర్ల నంబరు ప్లేట్లను మార్చి వాటి ద్వారా సచివాలయ హార్టికల్చర్ సిబ్బంది ద్వారా ఈ అక్రమాలకు పాల్పడినట్టు తెలిసింది. ఈ అక్రమాలకు చేసిన వే బ్రిడ్జి నిర్వాహకులకు ట్రాక్టర్‌కు రూ.2 వేలు, హార్టికల్చర్ సిబ్బందికి రూ.1500, దొంగ ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున ఇచ్చినట్టు తెలిసింది.
దీనిపై విచారణ చేస్తే
అసలు దొంగలు బయటకొస్తారు!
మామిడి రైతుల్లో 40 శాతం మంది దొంగ బిల్లుల ద్వారా ప్రభుత్వం నుంచి రూ.46 కోట్ల కుంభకోణానికి సంబంధించి హార్టికల్చర్ అధికారులు దీనిపై సమగ్రమైన విచారణ చేపడితే మరిన్ని మోసాలు బయటపడే అవకాశాలున్నాయి. అయితే ఈ అక్రమాల్లో హార్టికల్చర్ అధికారులే కీలకమైనందున ఎలా అక్రమాలు వెలుగు చూస్తాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జరిగిన అక్రమాలపై జిల్లా కలెక్టర్ అయినా స్పందించి పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సిన అవరసం ఎంతైనా ఉంది.
ఇదీ నష్టపరిహారం లెక్క...