
కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
– మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
శ్రీరంగరాజపురం : రాష్ట్రంలో కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబునాయుడు అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణస్వామి మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మద్యపానం నిషేధం అమలు చేస్తే, ఆయన అల్లుడు చంద్రబాబునాయుడు ఊరురా బెల్ట్‌షాపులు పెట్టి మద్యాన్ని ఏరులై పారించారన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. గతంలో కల్తీ మద్యం విక్రయానికి అవకాశం లేకుండా జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వమే మ ద్యం షాపులు నిర్వహిస్తే, నేడు మద్యం షాపులో కల్తీ మద్యం ఏరులైపారుతుందన్నారు. కల్తీ మద్యం కేసు విచారణకు ఏర్పాటు చేసిన సిట్‌పై రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఎందుకంటే ఈ సిట్ కూటమి ప్రభుత్వం చెప్పినట్లు అధికారులు చేస్తారని, అందుకే సీబీఐతో కల్తీ మద్యంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభు త్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇసుక, గ్రానైట్, గ్రావెల్ అక్రమ రవాణా, గంజాయి విక్రయం తదితర అసాంఘిక కార్యకలాపాలతో రాష్ట్రంలో అవి నీతి రాజ్యమేలుతుందన్నారు. యువత గంజాయికి బానిసై తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు అన్ని రంగాల్లో పెద్ద పీట వేస్తున్నాయని ప్రగల్బాలు పలికే టీడీపీ ప్రభుత్వంలో నేడు మహిళలపై దాడులు, అఘాయిత్యాలు,అత్యాచారాలు జరుగుతున్నా, కూ ్డటమి సర్కారు చూసి చూడనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే థామస్ తన కుమార్తె, వైఎస్సార్ సీపీ గంగాధరనెల్లూరు నియోజవర్గం సమన్వయకర్తపై అసభ్యకరమైన రీతిలో సభ్యసమాజం తలదించుకునేలా వ్యంగంగా మాట్లాడటం టీడీపీకే చెందుతుందన్నారు. మహిళలు చీరలు కట్టుకోకూడదా? నగలు వేసుకోకుడదా? అని ప్రశ్నించారు. ఈ సృష్టికి మూలం సీ్త్ర అని, ఆ సీ్త్రమూర్తికి నేడు అవమానం జరిగితే సభ్యసమాజం తలదించుకోవాలన్నారు. ప్రపంచంలో అన్ని వర్గాల వారికి దేవుడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అని, అలాంటి మహనీయుడిపై కూడా టీడీపీ రాజకీయం చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.