
కల్వర్టు కొట్టుకుపోయింది!
తవణంపల్లె: మండలంలో ఇటీవల కాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు బహునది పరివాహక ప్రాంతాలైన అరగొండ సమీపంలోని కల్వర్టు, మత్యం వద్ద వాగుపై ఉన్న కల్వర్టు కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించిపోయాయి. సుమారు వారం రోజులుగా ప్రజల రాకపోకలకు, స్కూల్ బస్సులు, పాలవ్యాన్లు, ఆర్టీసీ బస్సుల రాకపోకలు స్తంభించాయి. మండలంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టకపోగా శాశ్వతంగా కల్వర్టులు నిర్మించి ప్రజల రాకపోకలకు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. వర్షాకాలం వస్తే ప్రజలకు రోడ్లతో వెతలు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే స్పందించి ప్రజల రాకపోకలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.