సర్కారు వేధింపులు సరికాదు! | - | Sakshi
Sakshi News home page

సర్కారు వేధింపులు సరికాదు!

Oct 15 2025 5:52 AM | Updated on Oct 15 2025 5:52 AM

సర్కా

సర్కారు వేధింపులు సరికాదు!

● రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ● వరసిద్ధి వినాయకస్వామికి ప్రత్యేక పూజలు ● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ ● కమిషనర్‌ ఉత్తర్వులు అమలు చేయని జిల్లా విద్యాశాఖాధికారులు ఐజర్‌కు ఎస్‌బీఐ భారీ విరాళం

– IIలో

– IIలో

న్యూస్‌రీల్‌

మామిడి విక్రయాల్లో మాయాజాలం ర్యాంపుల్లో గోల్‌మాల్‌ బినామీ పేర్లతో కాయలు తోలినట్లు లెక్కలు పరిశీలనలో తేలని అక్రమాలు ఫ్యాక్టరీ ఇవ్వాల్సిన రూ.8పై నిలదీస్తున్న రైతు నాయకులు

పీహెచ్‌సీ వైద్యుల న్యాయమైన డిమాండ్లు నెర వేర్చకుండా వేధింపులకు పాల్పడడం సరికాదని శ్రీనివాసమూర్తి అన్నారు.

బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

ఏడాది పాటు చెమటోడ్చి కష్టించే మామిడి రైతులంటే అందరికీ అలుసుగా మారింది. తోతాపురి మామిడి రైతులను ఈ ఏడాది ఎన్నడూ లేనన్ని కష్టాలు చుట్టుముట్టాయి. పంట విక్రయం ద్వారా వచ్చే సొమ్ముతో కుటుంబ అవసరాలు, చేసిన అప్పులు తీర్చుకుందామనుకున్న కర్షకుల ఆశలు అడియాశలయ్యాయి. తోతాపురి విక్రయంలో అన్ని దశల్లోనూ పుడమి పుత్రులు దగా పడ్డారు.

మామిడి కాయలతో క్యూకట్టిన ట్రాక్టర్లు (ఫైల్‌)

19న చెస్‌ పోటీలు

చిత్తూరు కలెక్టరేట్‌ : ఆల్‌ చిత్తూరు చెస్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ సహకారంతో ది స్కూల్‌ ఆఫ్‌ చెస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన చి త్తూరుటౌన్‌లో చెస్‌ చాంపియన్‌ చెస్‌ పోటీలు నిర్వహించనున్నారు. మంగళవారం జిల్లా చెస్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ బాబుప్రసాద్‌రెడ్డి, ఆంధ్రా చెస్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.ఆర్‌.బి ప్రసాద్‌ చెస్‌ పోటీల వివరాలను వెల్లడించారు. చిత్తూరు నగరంలోని విద్యార్థులు మా త్రమే చెస్‌ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత ఉంటుందన్నారు. అండర్‌ 7,9,12,16 విద్యార్థులు చెస్‌ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు 9000475799 నంబర్‌లో సంప్రదించి పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వారు కోరారు.

కర్నూలుకు 250 ఆర్టీసీ బస్సులు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): కర్నూలులో జరిగే పీఎం సభకు జిల్లా నుంచి 250 బస్సులు కేటాయించారు. చిత్తూరు వన్‌డిపో నుంచి 42, టూడిపో నుంచి 53, కుప్పం నుంచి 70, పలమనేరు నుంచి 37, పుంగనూరు నుంచి 47 బస్సులు పంపాలని నిర్ణయించారు. ఇవీ బుధవారం జిల్లా నుంచి కర్నూలుకు బయలుదేరనున్నాయి. గురువారం జరిగే సభ ముగిసిన తరువాత శుక్రవారం తిరిగిరానున్నాయి. దీంతో మూడు రోజులపాటు జిల్లాలోని ప్రయాణికులకు అవస్థలు పడాల్సి ఉంది.

18న ప్రదోషపూజ

కాణిపాకం: శని త్రయోదశిని పురస్కరించుకుని ఈనెల 18వ తేదీన కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైనా మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రదో ష పూజ జరగనున్నట్లు ఈఓ పెంచలకిషోర్‌ తెలిపారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రదోషపూజ జరుగుతుందని ఆయన తెలిపారు.

నేడు విద్యుత్‌ గ్రీవెన్స్‌

చిత్తూరు కార్పొరేషన్‌ : విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి బుధవారం వి ద్యుత్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో చిత్తూరు అర్బన్‌ ఈఈ మునిచంద్ర తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15 వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్థానిక గాంధీరోడ్డులోని అర్బన్‌ డివిజన్‌ కార్యాలయంలో గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల విద్యుత్‌ వినియోగదారులు సమస్యలను వినతుల రూపంలో తెలియజేయాలని ఆయన కోరారు.

తిరుపతి ఎడ్యుకేషన్‌: తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐజర్‌)కు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రూ.23.60లక్షల విరాళం అందించింది. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద ఐజర్‌లో మౌలిక వసతుల కల్పన ఈ మొత్తం అందజేసింది. ఇందులో అత్యవసర వైద్య సేవల నిమిత్తం రూ.15.38లక్షల విలువైన అంబులెన్స్‌, క్యాంటీన్‌ సేవల మెరుగుపరిచేందుకు రూ.8.22లక్షల విలువైన ఆటోమెటిక్‌ కియోస్క్‌ వ్యవస్థను వితరణ చేసింది. మంగళవారం ఈ మేరకు ఎస్‌బీఐ ఉన్నతాధికారులు రాజేష్‌కుమార్‌ పటేల్‌, అమరేంద్రకుమార్‌ సుమన్‌, దినేష్‌ గులాటీ చేతుల మీదుగా ఐజర్‌ ప్రతినిధులకు అందజేశారు.

గుజ్జు లాగేశారు!

కాణిపాకం: మామిడి కాయల విక్రయంలో బినామీ లెక్కలకు రెక్కలొచ్చాయి. అక్రమాలు పరిశీలన పక్క దారి పట్టింది. అసలు లెక్కలను అధికారులు తోసిపుచ్చారు. బోగస్‌ లెక్కలను తేల్చలేకపోయారు. త ద్వారా ప్రభుత్వం అందించిన మామిడి ప్రో త్సాహక నిధి రూ.4 చెల్లింపు దుర్వినియోగమైందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. రా యితీ పోయినా ఫ్యాక్టరీ చెల్లించాల్సిన రూ.8 కోసం రోడ్డెక్కారు. రైతు సంఘం నేతల గొంతు నొక్కేందుకు కొందరు ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో తోతాపురి మామిడి అవకతవలను నివారణకు జిల్లా యంత్రాంగం ముందుకు వచ్చి కాయలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తోతాపురి కిలో రూ.12 గిట్టుబాటు ధరను ప్రకటించింది. ఫ్యాక్టరీలు కిలో రూ.8 చెల్లించేలా, ప్రభుత్వం ప్రోత్సాహక నిధి కింద రూ.4 చెల్లిస్తామని వెల్లడించింది. అయితే కాయల విక్రయానికి టోకెన్ల పద్ధతి ప్రవేశ పెట్టింది. ఈ క్రమంలో రాయితీపై కన్నేసిన కొందరు అక్రమాలకు తెగబడ్డారు.

మధ్యవర్తుల దందా..

మామిడి కొనుగోలు సమయంలో ఫ్యాక్టరీల వద్ద కొందరు కాపు కాచారు. కూటమి నేతలు, ప్రజాప్రతినిధుల పేరు చెప్పి టోకన్లను అమ్ముకున్నారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో పండిన కాయలను జిల్లాలోని ఫ్యాక్టరీలకు తరలించారనే వాదనలు వినిపించాయి. ఈ దోపిడీ జోరుగా సాగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై తమిళనాడు సరిహద్దులో నిఘా పెట్టారు. దీనికితోడు వ్యాపారులను బుట్టలో వేసుకుని కూటమికి చెందిన కొందరు ప్రభుత్వ ప్రోత్సాహక నిధి దోపిడీకి తెరలేపారు. ర్యాంపులను అడ్డం పెట్టుకుని కాయలు కాటా వేసి, బోగస్‌ పేర్లు, బిల్లులు సృష్టించారు. ఇలాంటివి బంగారుపాళెం, కుప్పం, వి.కోట, పలమనేరు, సోమల తదితర ప్రాంతాల్లో జరిగినట్లు విమర్శలు వచ్చాయి. అలాగే నీలం కాయలను కూడా ర్యాంపులకు తరలించి తోతాపురి లెక్కల్లోకి ఎక్కించారని ఆరోపణలు భగ్గుమన్నాయి. దీనిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రపంచ మామిడి దినోత్సవ సభలో భగ్గుమన్నారు. బోగస్‌ లెక్కలను బయటకు తీస్తామని సభ సాక్షిగా హామీ ఇచ్చారు. అయితే అధికారులు పరిశీలన పేరుతో జాప్యం చేసి తమ చేతులు దులుపుకున్నట్లు తెలిసింది. ర్యాంపుల వద్ద లెక్కలు గందరగోళంగా ఉండడంతో ఏం చేయలేక మిన్నకుండిపోయినట్లు సమాచారం.

నిధి మంజూరుతో ఇలా..

అధికారులు పరిశీలన పూర్తి చేసి ఇచ్చిన నివేదికలపై రైతులకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 31,929 మంది రైతులు 79,963 సార్లు కాయలు తరలించగా 3.67లక్ష టన్నుల కాయలు విక్రయించినట్లు లెక్కకట్టారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.146 కోట్ల మేర నిధులు మంజూరు చేసిందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ చెల్లింపులపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోగస్‌ లెక్కలు తేల్చకుండా నిధులు జమ చేయడంపై మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రూ.8 మాటేంటీ..

వైఎస్సార్‌ సీపీ, మాజీ సీఎం జగన్‌ చల్లగుండాలని..

పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు

– 23 నుంచి 30వ తేదీ వరకు నిర్వహణ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు ప్రత్యేక ఆధార్‌ క్యాంపుల నిర్వహణకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. 2026వ సంవత్సరం సెప్టెంబర్‌ 30వ తేదీలోపు కచ్చితంగా మ్యాండిటరీ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ (ఎంబీయూ) చేయించుకోవాలని ఆధార్‌ సంస్థ యూఐడీఏఐ ఆదేశించింది. ఈ మేరకు ఎంబీయూ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు గుర్తించిన పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంప్‌లు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 5 నుంచి 15 ఏళ్ల లోపు వయస్సు ఉన్న 32,011 మంది, 15 సంవత్సరాలు పైబడిన 16,937 మంది మొత్తం 48,948 మంది విద్యార్థులు మ్యాండిటరీ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేయించుకోవాలని అధికారులు వెల్లడిస్తున్నారు. వీరందరికీ ఆధార్‌ అప్‌డేట్‌ చేసేలా ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు.

అధికారిక సమావేశంలో టీడీపీ నేత

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: అదేదో మారుమూ ల ప్రాంతం కా దు..సాక్షాత్తు జిల్లా ఉన్నతాధికారి ఉండే కలెక్టరేట్‌ కార్యాలయం. ఆ కార్యాలయంలోని కలెక్టరేట్‌ చాంబర్‌లో టూ రిజం అధికారులతో నిర్వహిస్తున్న సమావేశంలో టీడీపీ నాయకుడు జయప్రకాష్‌నాయుడు తిష్టవేశారు. అధికారిక సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఎలాంటి హోదా లేని ఆయన తిష్ట వేయడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధి హోదా లేని ఆయన కలెక్టర్‌ చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం ఏమిటని సమావేశంలో పాల్గొన్న అధికారులే పెదవి విరుస్తున్నారు. ప్రజాప్రతినిధి హోదా లేని నాయకులను ప్రోత్సహిస్తున్న జిల్లా యంత్రాంగంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపడితే విలువ కోల్పోకుండా ఉంటారని పలువురు పెదవి విరుస్తున్నారు.

కాణిపాకం: వైఎస్సార్‌ సీపీతోపాటు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చల్లగుండాలని ఆ వరసిద్ధి వినాయకస్వామివారిని వేడుకున్నట్లు రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామివారిని మంగళవారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయాధికారులు ఆయనకు దగ్గరుండి స్వామివారి దర్శనం కల్పించారు. వేద ఆశీర్వచన మండపంలో పండితులు శేషవస్త్రం అందజేసి, ఆశీర్వచనం పలికారు. తర్వాత ఆలయాధికారులు స్వామి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీతోపాటు, జగన్‌కు ఎల్లప్పుడు వరసిద్ధివినాయకస్వామివారి ఆశీర్వాదం ఉండాలని ప్రార్థించినట్లు పెద్దిరెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనంజయరెడ్డి, ఆలయ మాజీ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ శాంతిసాగర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు తలపులపల్లి బాబురెడ్డి, మాజీ ఎమ్మెల్యే లలితా కుమారి, మండల కన్వీనర్లు శ్రీకాంత్‌రెడ్డి, పాలేరు రామచంద్రారెడ్డి, హరిరెడ్డి, బుజ్జిరెడ్డి, నాయకులు శిరీష్‌రెడ్డి, బాబురెడ్డి, సుధాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మనోహర్‌, ప్రవీణ్‌రెడ్డి, పాలాక్షిరెడ్డి, చిన్నారెడ్డి, ప్రకాష్‌రెడ్డి, కిషోర్‌కుమార్‌రెడ్డి, నాగరాజు, సైలేష్‌, కుమారరాజా, గోవిందస్వామి, కోదండ, అన్నామలై తదితరులు ఉన్నారు.

స్వామివారిని దర్శించుకుంటున్న మాజీ మంత్రి పెడ్డిరెడ్డి రామచంద్రారెడ్డి, నాయకులు

స్వామివారి సన్నిధిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

న్యాయం గెలిచింది

ప్రభుత్వం తోతాపురికి ప్రకటించిన మద్ధతు ధర విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. రూ.4 ప్రోత్సాహక నిధి చెల్లించి..చేతులు దులుపుకుంటోంది. అయితే ఫ్యాక్టరీ నుంచి కిలో రూ.8 ఇవ్వాల్సి ఉండగా..దీనిపై నోరువిప్పడం లేదు. ఇది వరకే కొన్ని ఫ్యాక్టరీలు కిలో రూ.5 చెల్లించగా రైతులు భగుమంటున్నారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు వ్యతిరేకంగా రైతు సంఘ నాయకులు అక్రందన సభ నిర్వహణకు సిద్ధపడ్డారు. బుధవారం బంగారుపాళెం మండలంలోని మార్కెట్‌యార్డులో సభ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కూటమికి చెందిన నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి రైతుల సంఘం నాయకులకు బెదిరింపులు వస్తున్నాయి. సభను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్ధతు ధరపై పోరాడుతున్న రైతు నాయకులను అడ్డుకుంటే భవిష్యత్‌ ఉండదని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

బోగస్‌ లెక్కలు తేల్చాలి

కొన్ని ర్యాంపుల్లో ప్రభుత్వ నిధిని దోచుకోవాలని బోగస్‌ లెక్కలు చూపించారు. ఆ లెక్కలు తేలకుండా నిధి జమ చేశారు. దీంతో ప్రజానిధి పక్కదారి పట్టిందని భావిస్తున్నాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఆ బోగస్‌ లెక్కలు తేల్చాలి. అలాగే ఫ్యాక్టరీలు కిలోకు రూ.8 ఇవ్వాలి. ఇందుకు అన్ని పార్టీలను సమన్వయం చేసుకుని సభకు పూనుకున్నాం. –ఉమాపతినాయుడు,

మామిడి రైతు సంఘ ఉపాధ్యక్షులు

ఫ్యాక్టరీల నుంచి రూ. 8 ఇప్పించాలి

ప్రభుత్వం తోతాపురికి మద్ద తు ధరగా కిలో రూ.12 ప్రకటించింది. ఆ ప్రకారమే రైతు లకు నగదు ఇప్పించాలి. ఫ్యా క్టరీలు కేజీకి రూ. 5 ఇస్తే ఒప్పకోం. కచ్చితంగా రూ.8 ఇవ్వా ల్సిందే. ఇవ్వని ఫ్యాక్టరీ లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈనేపథ్యంలోనే బంగారుపాళ్యంలో అక్రందన సభను నిర్వహిస్తున్నాం. ఈ సభను అడ్డుకోవద్దు. మేము రైతుల కోసం పోరాడుతున్నాం. ఇందుకు అందరు సహకరించాలి.

– జనార్దన్‌, మామిడి రైతు సంఘ అధ్యక్షులు

ఇంకా చేయాల్సింది ఉంది

మామిడి కొనుగోలుపై పరిశీలన చేపట్టాం. పరిశీలనలో చాలా వరకు తీసేశాం. ఇంకా పరిశీలన చేయాల్సి ఉంది. చేస్తాం. ఏదైనా అనుమానం ఉంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. కచ్చితంగా స్పందిస్తాం. చర్యలు తీసుకుం టాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. అనుమానాలు వద్దు.

– మధుసూదన్‌రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, చిత్తూరు

సర్కారు వేధింపులు సరికాదు! 
1
1/9

సర్కారు వేధింపులు సరికాదు!

సర్కారు వేధింపులు సరికాదు! 
2
2/9

సర్కారు వేధింపులు సరికాదు!

సర్కారు వేధింపులు సరికాదు! 
3
3/9

సర్కారు వేధింపులు సరికాదు!

సర్కారు వేధింపులు సరికాదు! 
4
4/9

సర్కారు వేధింపులు సరికాదు!

సర్కారు వేధింపులు సరికాదు! 
5
5/9

సర్కారు వేధింపులు సరికాదు!

సర్కారు వేధింపులు సరికాదు! 
6
6/9

సర్కారు వేధింపులు సరికాదు!

సర్కారు వేధింపులు సరికాదు! 
7
7/9

సర్కారు వేధింపులు సరికాదు!

సర్కారు వేధింపులు సరికాదు! 
8
8/9

సర్కారు వేధింపులు సరికాదు!

సర్కారు వేధింపులు సరికాదు! 
9
9/9

సర్కారు వేధింపులు సరికాదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement