
పత్తికొండలో విషాద ఛాయలు
ఒంగోలు వద్ద రోడ్డు ప్రమాదంలో పలమనేరు వాసులకు గాయాలు విజయవాడలో సమ్మెకెళుతున్న ట్రాన్స్‌కో సిబ్బంది రోడ్డుపై నుంచి నీటిలో పడిన టెంపో ట్రావెలర్
ఆస్పత్రికి తరలుతున్న క్షతగాత్రులు
పలమనేరు/గంగవరం: మండలంలోని పత్తికొండలో తీవ్ర విషాదం నెలకొంది. ఒంగోలు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాన్స్‌కోకు చెందిన ఓ జేఎల్‌ఎం మృతి చెందగా, మరో నలుగరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. పలమనేరు ట్రాన్స్‌కో పరిధిలోని సిబ్బంది తమ సమస్యల సాధన కోసం విజయవాడలో సోమవారం జరిగే నిరసన కార్యక్రమానికి ఆదివారం ఇక్కడి నుంచి టెంపో ట్రావెలర్‌లో 19 మంది బయలుదేరారు. వీరి వాహనం ఒంగోలు వద్ద వంతెనపై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో గంగవరం మండలం, పత్తికొండకు చెందిన జూనియర్ లైన్‌మన్ చరణ్(30) మృతి చెందాడు. సురేంద్ర, నాయక్, కుపేంద్ర, ప్రసాద్ గాయపడినట్టు తెలిసింది. స్థానిక ట్రాన్స్‌కో ఏడీ జీవన్‌రెడ్డి, అధికారులు సైతం విషయం తెలిసిన వెంటనే అక్కడి ఆస్పత్రివద్దకు వెళ్లారు.

పత్తికొండలో విషాద ఛాయలు

పత్తికొండలో విషాద ఛాయలు