
నీతి అయోగ్ డైరెక్టర్‌తో భేటీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాకు విచ్చేసిన నీతి అయోగ్ డైరెక్టర్ జుబైర్ అలీ హష్మీతో కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ భేటీ అయ్యారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయనను కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతి పై కాసేపు చర్చించారు.
పిడుగుపాటుకు
దెబ్బతిన్న ఇల్లు
బంగారుపాళెం: మండలంలోని తుంబకుప్పంలో పిడుగుపాటుకు ఓ ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గ్రామానికి చెందిన రాణెమ్మ ఇంటిపై ఉన్న నీటి ట్యాంకుపై పిడుగు పడింది. దీంతో ఇల్లు పాక్షికంగా దెబ్బతినడంతో పాటు కరెంటు వైర్లు, ఇతర విద్యుత్ సామగ్రి కాలిపోయాయి. రెండు రోజుల క్రితం రాణెమ్మ బెంగళూరులో ఉన్న తన కుమార్తె దగ్గరకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది.

నీతి అయోగ్ డైరెక్టర్‌తో భేటీ