
రైతుల సమక్షంలోనే భూ రీసర్వే
నిండ్ర : మండలంలో జరుగుతున్న ముడో విడత భూ రీసర్వే పనులను రైతుల సమక్షంలోనే చేయాలని సర్వేయర్ ల్యాండ్ రికార్డు జిల్లా అధికారి జయరాజ్ అన్నారు. బుధవారం నిండ్ర మండలం కేఆర్ పాళెంలో జరుగుతున్న రీసర్వే పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీసర్వేకు మందు ప్రతి రైతుకు ముందుగానే విషయం తెలిపి నోటీసులు అందించి వారి సమక్షంలోనే భూమిని సర్వే చేసి రికార్డులను తయారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో నగరి డివిజన్ అధికారి ప్రసాద్ రావు, తహసీల్దార్ శేషగిరిరావు, మండల సర్వేయర్ వెంకటేశు, తదితరులు పాల్గొన్నారు.