
జూడో జిల్లా పోటీలకు ఎంపిక
వడమాలపేట (పుత్తూరు) : ఉమ్మడి చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ అండర్–19 జూడో జిల్లా జట్టుకు వడమాలపేట జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యారు. బుధవారం తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయంలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న వడమాలపేట విద్యార్థినులు గీతశ్రీ 40 కిలోల విభాగం, అంజలి 48 కిలోల విభాగంలో ప్రథమ స్థానాలను కై వసం చేసుకొని ఉమ్మడి చిత్తూరు జిల్లా జూడో జట్టుకు ఎంపికయ్యారు. వీరు అక్టోబర్ చివరి వారంలో శ్రీసత్యసాయి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను స్కూల్ హెచ్‌ఎం కరుణా నవనీతం, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.