
నీటిలో నిలబడి నిరసన
వెదురుకుప్పం : 30 ఏళ్లుగా నరకయాతన పడుతున్నామని, రోడ్డు మరమ్మతు చేపట్టాలని కురివికుప్పం ఎస్సీ కాలనీ వాసులు రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడారు. రోడ్లు అధ్వాన్నంగా ఉండడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లాలంటే నరకయాతన పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే రోడ్డుపై అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నామంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రోడ్డును ఆధునికీకరించి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.