
మళ్లీ ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు: మండలంలో రెండు రోజుల తర్వాత తిరిగి ఏనుగులు ప్రవేశించాయి. భాకరాపేట అడవుల్లోకి వెళ్లి పోయాయనుకుని రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి దర్శనమివ్వడంలో బెంబేలెత్తిపోతున్నారు. శనివారం తెల్లవారు జామున పాతపేట, ఎద్దులవారిపల్లె, కోటపల్లె, పాళెం గ్రామాల్లోని పొలాల్లో ప్రవేశించి పంటలను ధ్వంసం చేశాయి. రైతులు హరి, ప్రసాద్, నాగరాజ, మునిరత్నం పొలాల్లో అరటి, టమాట, వేరుశనగ, మామిడి వరి పంటలను తొక్కి నాశనం చేశాయి.
డీఎస్‌డీఓగా ఉదయ్‌భాస్కర్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీవో)గా ఉదయ్‌భాస్కర్‌ను నియమిస్తూ శాప్ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. సత్యసాయి జిల్లా డీఎస్‌డీవోగా ఉన్న ఆయన చిత్తూరుకు బదిలీపై రానున్నారు. ఇప్పటి వరకు డీఎస్‌డీవోగా ఉన్న బాలాజీని చిత్తూరులోనే ఖోఖో కోచ్‌గా కొనసాగించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.