
త్వరలో కానిస్టేబుళ్లకు శిక్షణ
చిత్తూరు అర్బన్: ఇటీవల వెలువడ్డ పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (డీటీసీ)లో త్వరలోనే శిక్షణ ప్రారంభమవుతుందని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. శుక్రవారం అధికారులతో కలిసి డీటీసీని పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ శిక్షణలో కనీస వసతులు, సదుపాయాలు పక్కాగా ఉండాలన్నారు. ఏఆర్ ఏఎస్పీ శివానంద కిషోర్, డీఎస్పీ మహబూబ్, సీఐలు అమర్‌నాథరెడ్డి, మనోహర్ పాల్గొన్నారు.
విచారణ అధికారి నియామకం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఎస్‌ఆర్‌పురం మండలం తహసీల్దార్‌గా షబ్బీర్‌బాషా (ప్రస్తుతం కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్నారు) పనిచేసే సమయంలో ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ ఘటన 2023 మార్చి 21న జరిగింది. ఆయనతో పాటు తయ్యూ రు వీఆర్‌వో గోవిందరెడ్డి సైతం ఈ కేసులో పట్టుబడ్డారు. వారిపై ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నమోదు చేస్తూ ఈ నెల 10న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఇద్దరినీ విచారించేందుకు చిత్తూరు జాయింట్ కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.