
ఇచ్చిన హామీ ఎక్కడ?
నీవానది పరివాహక ప్రాంతంలో రిటైన్‌వాల్ ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. గోడ ఎక్కడ నిర్మించారు..? కార్పొరేషన్ నిధులతో ప్రజలకు భోజనాలు అందిస్తే, ఎమ్మెల్యే ఏదో దానం చేసినట్టు ప్రచారం చేయించుకుంటున్నారు. చిత్తూరు ప్రజల ఇబ్బందులు చూడటానికి కూడా ఎమ్మెల్యేకు సమయంలేదా..? అసలు ఎమ్మెల్యే ప్రజలు అందుబాటులో ఎక్కడున్నారు..? కార్పొరేషన్ అధికారులు వరదల పేరిట, నీవానది శుభ్రత కోసం ఎంత ఖర్చు చేశారు..? ఏ నాయకుడి జేబులు నింపుతున్నారనే వివరాలు కూడా త్వరలోనే ప్రజల ముందు ఉంచుతాం.
– విజయానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్సార్‌సీపీ