
పీఆర్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా
చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శశిధర్ ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా శశిధర్, ప్రధాన కార్యదర్శిగా చెంచురత్నం యాదవ్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్‌లుగా లక్ష్మీపతి యాదవ్, గిరిధర్‌రెడ్డి, చక్రపాణి, త్రివిక్రమరావు, ఉపాధ్యక్షులుగా మూర్తి, వాణి, లోకే ష్, కుమార్, సంయుక్త కార్యదర్శులుగా అలీ, లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.