
కూటమి కల్తీ మద్యంపై నిరసనలు
పుంగనూరు : కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం మాఫియా, వేల కోట్ల రూపాయలను చట్ట వ్యతిరేకంగా దోచుకోవడంపై సోమవారం ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఆదివారం తిరుపతిలో పుంగనూరు నియోజకవర్గ నాయకులు , వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, వల్లివేడు పృధ్వీధర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీంబాషాలతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం వ్యాపారంతో వేల కోట్లు దోచుకుంటున్న తెలుగుదేశం నాయకుల వ్యాపారాల గురించి ప్రజలకు వివరిస్తూ చైతన్యం చేయాలన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని సూచించారు. కార్యక్రమంలో పుంగనూరు పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్, నాయకులు గౌస్, అఖిల్, బావాజాన్ తదితరులు పాల్గొన్నారు.