
ముగిసిన పర్యటన
చిత్తూరు అర్బన్: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్లుఫోలియో జడ్జి జస్టిస్ బీ.కృష్ణమోహన్ రెండు రోజుల జిల్లా పర్యటన ముగిసింది. ఆదివారం చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారికతో కలిసి చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. అదాలత్‌లు నిర్వహించి కేసులను బాగానే పరిష్కరిస్తున్నా.. కొత్త కేసులు కూడా అదే తరహాలో ఫైల్ అవుతున్నాయన్నారు. ఇది న్యాయమూర్తులపై మరింత బాధ్యతను పెంచుతోందని చెప్పారు. ప్రధానంగా దీర్ఘకాలికంగా న్యాయస్థానాల్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించి, కక్షిదారులకు మేలు చేకూర్చాలన్నారు. కుటుంబ తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు, విడాకుల కేసుల్లో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారాలు చూపించాలన్నారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు రమే ష్, భారతి, శ్రీదేవి, శ్రీనివాసరావు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన పర్యటన